Hospital Superintendent in ACB Net: ఏసీబీ వలలో నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ !
ఏసీబీ వలలో నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ !
Hospital Superintendent in ACB Net: తెలంగాణాలో అవినీతి అధికారుల భరతం పడుతున్నారు ఏసీబీ(ACB) అధికారులు. ఓ వ్యక్తికి సంబంధించిన భూమికి పట్టాదారు పాసుపుస్తకాలు జారీ చేసేందుకు శామీర్ పేట తలహీల్ధార్ సత్యనారాయణ పది లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీ చిక్కి 72 గంటలు కాకముందే మరో అవినీతి తిమిగంలం ఏసీబీ వలకు చిక్కింది. ప్రభుత్వ ఆసుపత్రులకు సరఫరా చేసే మందుల టెండర్ ను ఆమోదించడానికి మూడు లక్షలు లంచం తీసుకుంటూ నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ లచ్చునాయక్ ఏసీబీకు చిక్కారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ లచ్చునాయక్… మందుల సరఫరా వ్యాపారి వెంకన్న నుండి రూ. 3 లక్షలు లంచం తీసుకుంటుండగా… ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ మేరకు అతనిపై అవినీతి నిరోదక చట్టం క్రింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే…
Hospital Superintendent in ACB Net Viral
వెంకన్న అనే మందుల వ్యాపారి… నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి గత రెండేళ్లుగా ఔషధాలు సరఫరా చేస్తున్నారు. దీనికోసం కొన్నాళ్లుగా సూపరింటెండెంట్ 10 శాతం కమీషన్ తీసుకుంటున్నారని… అయితే ఇటీవల కమీషన్ శాతాన్ని పెంచాలని డిమాండ్ చేసినట్లు బాధితుడు వెంకన్న వెల్లడించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ లచ్చు నాయక్ కు నెలరోజుల క్రితం రూ.లక్ష లంచంగా ఇవ్వగా… నాలుగు రోజుల క్రితం మరో రూ. 3 లక్షలు డిమాండ్ చేయడంతో ఏసీబీని ఆశ్రయించినట్లు తెలిపారు. వెంకన్న ఫిర్యాదు మేరకు రంగంలోనికి దిగిన ఏసీబీ అధికారులు… రూ. 3 లక్షలు లంచం తీసుకుంటుండగా లచ్చు నాయక్ నివాసంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
Also Read : AP High Court : నిబంధనలకు వ్యతిరేకంగా డీఎస్సీ నోటిఫికేషన్…హైకోర్టు అత్యవసర సమావేశం!