Namrata Reddy Satliva : న‌మ్ర‌తా రెడ్డి ‘సౌంద‌ర్య’ విజ‌యం

సాట్లీవా కో ఫౌండ‌ర్ గా ఘ‌న‌మైన ఆదాయం

Namrata Reddy Satliva : ప్ర‌కృతిని న‌మ్ముకుంటే సిరులు కురుస్తాయ‌ని వీరిని చూస్తే తెలుస్తుంది. బెంగ‌ళూరుకు చెందిన హ‌ర్ష వ‌ర్ద‌న్ రెడ్డి సిరూప , న‌మ్ర‌తా రెడ్డి(Namrata Reddy Satliva)  సిరూప దంప‌తులు వ్యాపార‌వేత్త‌లుగా ఎలా విజ‌యాన్ని సాధించారో తెలుసుకుంటే విస్తు పోవ‌డం త‌ప్ప‌దు. ఈ ఇద్ద‌రూ క‌లిసి సాట్లీవా అనే సంస్థ‌ను స్థాపించారు.

ఇది పూర్తిగా ప్ర‌కృతితో ముడి ప‌డి ఉన్న ఉత్ప‌త్తుల త‌యారీ సంస్థ‌. ప్ర‌త్యేకించి చ‌ర్మ వ్యాధుల నుంచి ఎలా కాపాడుకోవాలో తెలియ చేసేందుకు మార్గంగా తీర్చిదిద్దారు వీరిద్ద‌రూ.

ప‌ర్యావ‌ర‌ణానికి ఎలాంటి హాని అన్న‌ది క‌ల‌గ‌కుండా ఉండేందుకు చేసిన వీరి ప్ర‌య‌త్నం ఫ‌లించింది. ఇవాళ గ‌ణ‌నీయ‌మైన ఆదాయాన్ని స‌మ‌కూర్చేలా చేసింది. న‌మ్రతా రెడ్డి సిరూప త‌న భ‌ర్త‌తో క‌లిసి 2017లో సాట్లీవా సంస్థ‌ను స్థాపించారు. 

ఒక‌రు ఫౌండ‌ర్ మ‌రొక‌రు కో ఫౌండ‌ర్. ఇంజ‌నీరింగ్ చ‌దివారు. అక్క‌డి నుంచి కాలిఫోర్నియాలోని శాన్ జోస్ స్టేట్ యూనివ‌ర్శిటీ నుండి మాస్ట‌ర్ ఆఫ్ సైన్స్ , కంప్యూట‌ర్ ఇంజ‌నీరింగ్ లో పోస్ట్ గ్రాడ్యూయేట్ డిగ్రీని పొందారు. కొన్నేళ్ల ప‌రిశోధ‌న, అధ్య‌య‌నం త‌ర్వాత నాసాలో క్వాలిటీ అస్యూరెన్స్ ఇంజ‌నీరింగ్ ప‌ని చేశారు. 

అక్క‌డ ఉన్నప్పుడే భార‌త దేశంలో జ‌న‌ప‌నార ప‌రిశ్ర‌మ‌లో స్వంత వెంచ‌ర్ ను ప్రారంభించాల‌ని నిర్ణ‌యించుకున్నారు. విదేశాల‌లో ప‌ని చేసిన అనుభ‌వం ఆ ఇద్ద‌రికీ తోడ్ప‌డింది. త‌మ కుమారుడికి గ‌జ్జి (తామ‌ర‌) రావ‌డం , ఎంత మంది డాక్ట‌ర్ల‌కు చూపించినా త‌గ్గ‌లేదు. 

ఇదే స‌మ‌యంలో హ‌ర్ష వ‌ర్ద‌న్ హెంప్ సీడ్ ఆయిల్ ఒక‌టిన్న‌ర బాబుకు వాడితే త‌గ్గింది. వ్య‌క్తిగ‌త సంర‌క్ష‌ణ ప‌రిశ్ర‌మ‌కు భ‌విష్య‌త్తు త‌ప్ప‌క ఉంటుందని నమ్మాం.

అదే మా స‌క్సెస్ కు కార‌ణ‌మైంద‌ని చెప్పారు న‌మ్ర‌తా రెడ్డి , హ‌ర్ష వ‌ర్ద‌న్ రెడ్డి. సాటిల్వాలో ప్ర‌యోజ‌న‌క‌ర‌మైన ప‌ర్యావ‌ర‌ణ‌, స్థిర‌మైన ఉత్ప‌త్తులు త‌యారు చేస్తున్నారు.

వీటిలో ఫేస్ క్రీములు, స‌బ్బులు, బాడీ బ‌ట‌ర్ లు , బాడీ , పేస్ ఆయిల్ లు , షాంపూ బార్ లు , హెయిర్ క్రీమ్ లు , హెయిర్ ఆయిల్ లు, లిప్ బామ్ లు కూడా ఉన్నాయి. వీట‌న్నింటిని ఇంట్లోనే త‌యారు చేస్తారు. ఇవ‌న్నీ నాలుగు లేదా ఆరు నెల‌ల కాల ప‌రిమితిలో ఉంటాయి.

Also Read : క్రియేటివిటీలో సప్నా కిర్రాక్

Leave A Reply

Your Email Id will not be published!