Nara Bhuvaneswari Brahmani : చర్చిలో బ్రాహ్మణి..భువనేశ్వరి
ప్రార్థనలు చేసిన అత్తా కోడలు
Nara Bhuvaneswari Brahmani : రాజమండ్రి – టీడీపీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు త్వరగా జైలు నుంచి విడుదల కావాలని కోరుతూ భార్య నారా భువనేశ్వరి , కోడలు నారా బ్రాహ్మణి(Nara Brahmani) రాజమండ్రిలో పేరు పొందిన లూథరన్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
ఈ సందర్బంగా వారు మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు ఎలాంటి తప్పు చేయలేదన్నారు. ఆయన పూర్తిగా అమాయకుడని, ఆయనకు ఏ పాపం తెలియదని చెప్పారు. తన 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడూ తప్పు చేసిన దాఖలాలు లేవని పేర్కొన్నారు.
Nara Bhuvaneswari Brahmani Visits Church
దేవుడి దీవెనలు, ఆశీస్సులతో నారా చంద్రబాబు నాయుడు త్వరలోనే బయటకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కావాలని కక్ష సాధింపు ధోరణితో వ్యవహరించిందని పేర్కొన్నారు. ఎక్కడా సంతకం చేయలేదని చెప్పారు నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి.
73 ఏళ్ల వయసు కలిగిన చంద్రబాబును తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన నిర్దోషిగా బయటకు వస్తారన్న నమ్మకం తమకు ఉందన్నారు. ఈ సందర్బంగా చర్చి లో ప్రార్థనలు చేసినట్లు తెలిపారు. ప్రజలు కూడా వేచి చూస్తున్నారని తెలిపారు.
Also Read : Gita Gopinath : విద్యార్థుల ప్రతిభకు గీతా ఫిదా