Gita Gopinath : విద్యార్థుల ప్ర‌తిభకు గీతా ఫిదా

ఐఎంఎఫ్ చీఫ్ షాకింగ్ కామెంట్స్

Gita Gopinath : ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సార‌థ్యంలోని వైసీపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున విద్యా రంగం అభివృద్ధికి కృషి చేస్తోంది. నాడు నేడు కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టారు. విద్యార్థులు చ‌దువుకునేందుకు పెద్ద ఎత్తున స‌హ‌కారం చేస్తోంది. ఈ త‌రుణంలో రాష్ట్రానికి చెందిన స్టూడెంట్స్ సంచ‌ల‌నంగా మారారు. 10 మంది విద్యార్థుల‌తో కూడిన బృందం అమెరికాలో ప‌ర్య‌టించింది.

Gita Gopinath Comment About AP Students

ప్ర‌త్యేకించి ఏపీలో త‌మ‌కు అందుతున్న విద్యా, సౌక‌ర్యాల గురించి వివ‌రించే ప్ర‌య‌త్నం చేశారు. ప్ర‌పంచ బ్యాంకు ప్ర‌తినిధుల‌తో ముచ్చటించారు. ఈ ప్ర‌తినిధి టీం వెంట ఉన్న‌తాధికారులు ఉన్నారు.

ఇందులో భాగంగా ఇంట‌ర్నేష‌న‌ల్ మోనటిరింగ్ ఫండ్ , వ‌ర‌ల్డ్ బ్యాంకు తొలి డిప్యూటీ మేనేజింగ్ డైరెక్ట‌ర్ , ఐఎంఎఫ్ చీఫ్ ఎక‌నామిస్ట్ , హార్వ‌ర్డ్ ఎక‌నామిక్స్ ప్రొఫెస‌ర్ గీతా గోపీనాథ్(Gita Gopinath) ను విద్యార్థులు క‌లుసుకున్నారు.

ఈ సంద‌ర్భంగా వారిని ప్ర‌త్యేకంగా అభినంద‌న‌ల‌తో ముంచెత్తారు ఐఎంఎఫ్ చీఫ్‌. ఐఎంఎఫ్ కు ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర విద్యార్థుల‌ను స్వాగ‌తించ‌డం నిజంగా త‌న‌కు ఆనందం క‌లుగుతోంద‌న్నారు. వీరితో మాట్లాడ‌టం త‌న‌ను విస్తు పోయేలా చేసింద‌న్నారు గీతా గోపీనాథ్.

Also Read : Devineni Uma : ఆధారాలు లేకుండానే బాబు అరెస్ట్

Leave A Reply

Your Email Id will not be published!