Nara Brahmani : ఐటీ ఉద్యోగులకు థ్యాంక్స్

స్ప‌ష్టం చేసిన నారా బ్రాహ్మ‌ణి

Nara Brahmani : ఏపీ స్కిల్ స్కాం కేసులో ఇరుక్కుని విచార‌ణ‌ను ఎదుర్కొంటున్న టీడీపీ చీఫ్‌, మాజీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడుకు సంఘీభావం ప్ర‌క‌టించారు హైద‌రాబాద్ లోని ప‌లు ఐటీ కంపెనీల‌కు చెందిన ఉద్యోగులు. న‌గ‌రం నుంచి నేరుగా శ్ర‌మ‌కోర్చి రాజ‌మ‌హేంద్ర వ‌రంలో ఉంటున్న నారా లోకేష్ భార్య‌, చంద్ర‌బాబు కోడ‌లు ,బాల‌కృష్ణ కూతురు నారా బ్రాహ్మ‌ణిని క‌లుసుకున్నారు.

Nara Brahmani Comment

ఈ సంద‌ర్బంగా తమ‌ను పోలీసులు అడ్డుకున్నార‌ని, వారు త‌మ ఫోన్లను కూడా వ‌ద‌ల లేద‌ని ఈ సంద‌ర్భంగా ఐటీ ఎంప్లాయిస్ వాపోయారు. ఈ విష‌యాన్ని నారా బ్రాహ్మ‌ణితో(Nara Brahmani) పంచుకున్నారు. దీనిపై తీవ్ర ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశారు నారా బ్రాహ్మ‌ణి. పోలీసులు శాంతి భ‌ద్ర‌త‌ల‌ను ప‌రిర‌క్షించాల్సింది పోయి త‌మకు మ‌ద్ద‌తు తెలిపిన వారిని ప‌నిగ‌ట్టుకుని వేధింపుల‌కు గురి చేయ‌డం దారుణ‌మ‌ని పేర్కొన్నారు.

మీరు ఎంతో నిబ‌ద్ద‌త‌తో ఇంత దూరం వ‌చ్చినందుకు మీ అంద‌రికీ పేరు పేరునా ధ‌న్య‌వాదాలు తెలియ చేసుకుంటున్నాన‌ని స్ప‌ష్టం చేశారు నారా బ్రాహ్మ‌ణి. త‌న మామ గారి ప‌ట్ల మీకు ఉన్న గౌర‌వం త‌న‌ను క‌దిలించి వేసింద‌న్నారు. చంద్ర‌బాబు నాయుడు ఒక విజ‌న్ ఉన్న నాయ‌కుడ‌ని పేర్కొన్నారు. ఆయ‌న నిర్దోషిగా బ‌య‌ట‌కు వ‌స్తార‌ని, ఆ న‌మ్మ‌కం త‌న‌కు ఉంద‌న్నారు బ్రాహ్మ‌ణి.

Also Read : Amruta Fadnavis : అమృత ఫ‌డ్న‌వీస్ వైర‌ల్

Leave A Reply

Your Email Id will not be published!