Nara Lokesh: అంగన్వాడీలకు నారా లోకేష్ హామీ !

అంగన్వాడీలకు నారా లోకేష్ హామీ !

Nara Lokesh: న్యాయమైన డిమాండ్ల కోసం ఉద్యమం చేస్తున్న అంగన్వాడీ అక్క చెల్లెమ్మలపై జగన్ నియంతలా వ్యవహరిస్తున్నారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శ నారా లోకేష్ ఆరోపించారు. గత 40 రోజులుగా అంగన్వాడీలు తమ న్యామైన సమస్యల పరిష్కారానికి ఉద్యమం చేస్తున్నారని… ఇద్దరు అంగన్వాడీ చెల్లెమ్మల ప్రాణాలు అనంత వాయువులో కలిసి పోయాయని అన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం ఎస్మా పేరుతో సజ్జల ద్వారా అంగన్వాడీలను బెదిరిస్తున్నరని మండిపడ్డారు. ఈ ఎస్మా చట్టం వైఎస్ జగన్ పాలిట భస్మాసుర హస్తంగా మారి… వచ్చే మూడు నెలల్లో టీడీపీ-జనసేన నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేసారు. టీడీపీ-జనసేన నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన వెంటనే అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తామని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు.

Nara Lokesh Comment

మంగళగిరిలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నారా లోకేష్(Nara Lokesh) మాట్లాడుతూ… జగన్ నియంతపాలనలో అంగన్వాడీ అక్కచెల్లెమ్మలు బలవుతున్నారని అన్నారు. రాజులు, రాజ్యాలు అంతరించిపోయి ప్రజాస్వామ్యం అమల్లోకి వచ్చాక తొలిసారిగా ఏపీ ప్రజలు పొరపాటున జగన్మోహన్ రెడ్డి అనే నయా నియంతకు అధికారమిచ్చారన్నారు. జగన్ అనాలోచిత, పిచ్చి నిర్ణయాలతో అన్నివర్గాల ప్రజలను అవస్థల పాలు చేస్తున్నాడని మండిపడ్డారు. ప్రభుత్వ అనాలోచిత, మొండివైఖరి కారణంగా ఇప్పటికే ఇద్దరు అంగన్వాడీ చెల్లెమ్మల ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ అంగన్వాడీలపై ప్రయోగించిన ఎస్మా ఆయన పాలిట భస్మాసుర హస్తంగా మారబోతోందన్నారు. ఎంతటి నియంత అయినా ప్రజాభీష్టానికి తలొగ్గక తప్పదన్న చారిత్రక సత్యాన్ని గుర్తించలేని జగన్… మరో 3నెలల్లోపే ఇంటికి వెళ్లడం ఖాయమని హెచ్చరించారు.

Also Read : YS Sharmila: వైఎస్సార్ ఆశయాల సాధనకు ఆఖరి నిమిషం వరకు పొరాడతాను – ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల

Leave A Reply

Your Email Id will not be published!