Nara Lokesh : విజ‌న్ లేని జ‌గ‌న్ తో ప‌రేషాన్ – లోకేష్

అరాచ‌క పాల‌న‌తో ఆగ‌మాగం

Nara Lokesh : టీడీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ నిప్పులు చెరిగారు. ఆయ‌న చేప‌ట్టిన యువ గ‌ళం పాద‌యాత్ర మంగ‌ళ‌వారం నాటితో 132 రోజుల‌కు చేరుకుంది. ప్ర‌స్తుతం నారా లోకేష్ తిరుప‌తి జిల్లా లోని వెంక‌ట గిరి నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు. ప‌దే ప‌దే జ‌గ‌న్ ఏపీని అన్ని రంగాల‌లో అభివృద్ది చేశాన‌ని అబ‌ద్దాలు చెబుతున్నాడంటూ ఆరోపించారు. తాను సీఎంగా కొలువు తీరిన త‌ర్వాత ఎన్ని ప‌రిశ్ర‌మ‌లు రాష్ట్రానికి తీసుకు వ‌చ్చాడో, ఎన్ని నిధులు మంజూరు చేశాడో శ్వేత ప‌త్రం విడుద‌ల చేయాల‌ని డిమాండ్ చేశారు నారా లోకేష్.

జ‌గ‌న్ రెడ్డికి విజ‌న్ అంటూ లేద‌ని ఎద్దేవా చేశారు. పాల‌న గాడి త‌ప్పింద‌ని, వైసీపీ నాయ‌కులు, శ్రేణులు ప్ర‌జ‌ల‌ను తీవ్ర ఇబ్బందుల‌కు గురి చేస్తున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ప్ర‌జ‌లు మార్పు కోరుకుంటున్నార‌ని త్వ‌ర‌లోనే తాము అధికారంలోకి వ‌స్తామ‌ని జోష్యం చెప్పారు టీడీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్(Nara Lokesh).

తాము వ‌చ్చాక జ‌గ‌న్ పాల‌న‌లో చోటు చేసుకున్న అక్ర‌మాల బండారాన్ని బ‌య‌ట‌కు తీస్తామ‌ని, చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హామీ ఇచ్చారు. ఓ వైపు రైతులు పంట‌లు న‌ష్ట‌పోయి నానా తంటాలు ప‌డుతుంటే సీఎం ఏం చేస్తున్నారంటూ ప్ర‌శ్నించారు. సీఎం సైకో లాగా వ్య‌వ‌హ‌రిస్తున్నాడ‌ని మండిప‌డ్డారు. జ‌నం ఛీ కొట్టే రోజు ద‌గ్గ‌ర‌లోనే ఉంద‌న్నారు. ఇక రానున్న‌ది చంద్ర‌బాబు రాజ్య‌మ‌న్నారు.

Also Read : Tirumala : తిరుమ‌ల‌ క్షేత్రం గోవింద నామ‌ స్మ‌ర‌ణం

Leave A Reply

Your Email Id will not be published!