Nara Lokesh : పోసానిపై పోరాటం ఆపను – లోకేష్
ఆయన చేసిన ఆరోపణలు అబద్దం
Nara Lokesh : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిప్పులు చెరిగారు. తనపై నిరాధార ఆరోపణలు చేసిన నటుడు పోసాని కృష్ణ మురళిని వదిలి పెట్టే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. కంతేరులో తాను 14 ఎకరాలు కొనుగోలు చేశానంటూ ఆరోపించారు. ఇందుకు సంబంధించి తాను ఎక్కడా కొనుగోలు చేయలేదు. కానీ ఆయన తనపై బురద చల్లేందుకు ప్రయ్నతం చేశాడు.
Nara Lokesh Comments Posani
ఆయనే కాదు వైకాపాలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు తమపై అనవసరంగా ఆరోపణలు చేయడం పరిపాటిగా మారిందన్నారు. దీంతో తాను నోటీసులు పంపించానని పోసానికి కానీ ఇప్పటి వరకు సమాధానం ఇవ్వలేదని మండిపడ్డారు నారా లోకేష్.
పోసాని కృష్ణ మురళి నిరాధార ఆరోపణలు చేసుకుంటూ పోతే తాను చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నించారు. అందుకే తాను న్యాయ పోరాటానికి దిగానని చెప్పారు. ఏపీ సర్కార్ వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. వైకాపా కుల రాజకీయాల వల్ల ఏపీ రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందన్నారు.
కుల, మత ప్రాంతాలకు అతీతంగా నిరుద్యోగులు అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని స్పష్టం చేశారు నారా లోకేష్(Nara Lokesh). యువ గళం పాదయాత్రలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Also Read : Chandrababu Naidu : 9 లీటర్ల నీళ్లుంటే 1 కేజీ కరెంట్