Shiva Raj kumar : అజిత్ తో న‌టించాలని ఉంది

క‌న్న‌డ న‌టుడు శివ రాజ్ కుమార్

Shiva Raj kumar : ప్ర‌ముఖ క‌న్న‌డ న‌టుడు శివ రాజ్ కుమార్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఓ జాతీయ టీవీ ఛాన‌ల్ తో ఆయ‌న మాట్లాడారు. ఈ సంద‌ర్బంగా త‌మిళ సినీ రంగంలో త‌న‌కంటూ ఓ స్పెష‌ల్ ఇమేజ్ క‌లిగిన దిగ్గ‌జ న‌టుడు అజిత్ కుమార్ తో క‌లిసి న‌టించాల‌ని ఉంద‌ని త‌న మ‌నసులోని మాట తెలిపారు. అత‌డు న‌టించిన సినిమాలు చాలా చూశాన‌ని, త‌న‌కు బాగా న‌చ్చాడ‌ని పేర్కొన్నాడు శివ రాజ్ కుమార్. అంతే కాదు అంత గొప్ప న‌టుడిగా గుర్తింపు పొందినా చాలా సౌమ్యంగా ఉండ‌డం గొప్ప విష‌య‌మ‌న్నారు.

Shiva Raj kumar Said

అందుకే త‌న‌కు అజిత్ అంటే ఇష్ట‌మ‌ని , ఒక‌వేళ క‌థ క‌నుక కుదిరితే ఎవ‌రైనా వ‌చ్చి త‌న‌ను న‌టించ‌మ‌ని అడిగితే వెంట‌నే ఓకే చెప్పేస్తాన‌ని అన్నాడు శివ రాజ్ కుమార్(Shiva Raj Kumar). ఇదిలా ఉండ‌గా ప్ర‌స్తుతం శివ రాజ్ కుమార్ చేసిన వ్యాఖ్య‌లు త‌మిళ నాట‌, క‌న్న‌డ నాట హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.

క‌న్న‌డ సినీ రంగంలో శివ రాజ్ కుమార్ మోస్ట్ పాపుల‌ర్ హీరో. త‌న త‌మ్ముడు అప్పు ఇటీవ‌లే చ‌ని పోయారు. తాజాగా శివ రాజ్ కుమార్ నెల్స‌న్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన జైల‌ర్ సినిమాలో న‌టించాడు. ఆ సినిమా రికార్డుల మోత మోగిస్తోంది. ఇందులో త‌మిళ సినీ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ , త‌మ‌న్నా భాటియాతో పాటు శివ రాజ్ కుమార్ , మ‌ల‌యాళ సూప‌ర్ హీరో మోహ‌న్ లాల్ కూడా న‌టించారు. ఇప్ప‌టికే ఈ మూవీ రూ. 450 కోట్లకు పైగా వ‌సూలు సాధించింది.

Also Read : Nara Lokesh : పోసానిపై పోరాటం ఆప‌ను – లోకేష్

Leave A Reply

Your Email Id will not be published!