Jailer Record : జైల‌ర్ రికార్డుల మోత క‌లెక్ష‌న్ల వేట‌

ఓవ‌ర్సీస్ లోనూ మామూలుగా లేదుగా

Jailer Record : నెల్స‌న్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన జైల‌ర్ దూకుడు ప్ర‌ద‌ర్శిస్తోంది. విడుద‌లైనప్ప‌టి నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకు పోతోంది. సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ సినీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ మూవీగా నిలిచి పోయింది. దీంతో త‌లైవా ఫ్యాన్స్ ప్ర‌పంచ వ్యాప్తంగా పండుగ చేసుకుంటున్నారు. ర‌జ‌నీకాంత్ మేన‌రిజం, డైలాగులు, ఫైట్స్ , డైరెక్ట‌ర్ టేకింగ్ మొత్తంగా జైల‌ర్ కెవ్వు కేక అనిపించేలా ఉండ‌డంతో ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు ప‌రుగులు తీస్తున్నారు.

Jailer Record Breaking

ఓ వైపు దీనికి పోటీగా మెగాస్టార్ చిరంజీవి న‌టించిన భోళా శంక‌ర్ బొక్క బోర్లా ప‌డింది. నిర్మాత అనిల్ సుంక‌రకు కోలుకోలేని షాక్ ఇచ్చింది. మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌కత్వం వ‌హించిన ఈ చిత్రం ఎక్క‌డా నిల‌వ‌లేక చ‌తికిల ప‌డింది. ఇక ర‌జ‌నీకాంత్ త‌న‌కు ఎదురే లేద‌ని చాటారు. 72 ఏళ్ల వ‌య‌స్సు వ‌చ్చినా ఇంకా త‌న‌లో న‌ట‌న బ‌తికే ఉంద‌ని చాటాడు సూప‌ర్ స్టార్.

తొలి వారం ముగిసే స‌రికి క‌లెక్ష‌న్లు దుమ్ము రేపుతున్నాయి. రూ.450.80 కోట్లు కొల్ల‌గొట్టింది జైల‌ర్(Jailer). ఇక రెండో వారం వ‌చ్చేస‌రికి తొలి రోజు రూ.19.37 కోట్లు , రెండో రోజు రూ. 17.22 కోట్లు వ‌సూలు చేసింది. మొత్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు రూ. 487.39 కోట్లు సాధించింది. ఇవాళ రూ.500 కోట్ల మార్క్ కూడా దాటే ఛాన్స్ ఉంద‌ని సినీ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.

Also Read : Shiva Raj kumar : అజిత్ తో న‌టించాలని ఉంది

Leave A Reply

Your Email Id will not be published!