Dulquer Salmaan : నిజ‌మైన కింగ్ ర‌జ‌నీకాంత్

దుల్క‌ర్ స‌ల్మాన్ కామెంట్స్

Dulquer Salmaan : రియ‌ల్ స్టార్ మాత్ర‌మే కాదు నిజ‌మైన కింగ్ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ అని ప్ర‌శంస‌లు కురిపించారు న‌టుడు దుల్క‌ర్ స‌ల్మాన్. త‌ను న‌టించిన సినిమాకు సూప‌ర్ స్టార్ న‌టించిన జైల‌ర్ కు వ‌చ్చిన ప్రేక్ష‌కుల‌లో క‌నీసం ఒక్క శాతం వ‌చ్చినా సూప‌ర్ స‌క్సెస్ అవుతుంద‌న్నారు దుల్క‌ర్ స‌ల్మాన్.

Dulquer Salmaan Praises Thalaivaa

చెన్నైలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో దుల్క‌ర్ స‌ల్మాన్(Dulquer Salmaan) మాట్లాడారు. తలైవాను పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తారు. ఆయ‌న‌ను చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంద‌న్నారు. తాను ర‌జ‌నీకాంత్ న‌ట‌నను చూసి ఎంతో నేర్చుకున్నాన‌ని తెలిపారు. ప్ర‌త్యేకించి ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే మ‌న‌స్త‌త్వం చాలా గొప్ప‌ద‌న్నారు దుల్క‌ర్ స‌ల్మాన్.

ఇదిలా ఉండ‌గా నెల్స‌న్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ర‌జ‌నీకాంత్ , త‌మ‌న్నా భాటియా, శివ రాజ్ కుమార్ , మోహ‌న్ లాల్, ర‌మ్య‌కృష్ణ‌, యోగి బాబు న‌టించారు. ఆగ‌స్టు 10న విడుద‌లైన ఈ చిత్రం కోట్లు కొల్ల‌గొడుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు రూ. 487.83 కోట్లు వ‌సూళ్లు సాధించింది. సూపర్ స్టార్ త‌న సినీ కెరీర్ లో అత్య‌ధికంగా వ‌సూళ్లు సాధించిన చిత్రంగా జైల‌ర్ నిలిచి పోయింది. మ‌రో వైపు చిరంజీవి న‌టించిన భోళా శంక‌ర్ బోల్తా ప‌డింది. మొత్తంగా ర‌జ‌నీకాంత్ 72 ఏళ్ల వ‌య‌సులో కూడా త‌న‌కు ఎదురే లేద‌ని చాటారు.

Also Read : Jailer Record : జైల‌ర్ రికార్డుల మోత క‌లెక్ష‌న్ల వేట‌

Leave A Reply

Your Email Id will not be published!