Nara Lokesh: ప్రధాని మోదీ పుట్టిన రోజు సందర్భంగా మంత్రి లోకేశ్ ప్రత్యేక పూజలు

ప్రధాని మోదీ పుట్టిన రోజు సందర్భంగా మంత్రి లోకేశ్ ప్రత్యేక పూజలు

Nara Lokesh : భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 75వ పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. విశాఖలో జరుగుతున్న గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (GCC) బిజినెస్ సదస్సు సందర్భంగా ప్రధాని మోదీకి (PM Modi) సీఎం చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ… నరేంద్ర మోదీ దేశానికి రైట్ టైమ్‌లో రైట్ లీడర్‌గా అయ్యారని కొనియాడారు. ఆయన నాయకత్వంలో దేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని ప్రశంసించారు. థర్డ్ లార్జెస్ట్ ఎకానమీగా భారత్ అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు.

Nara Lokesh Special Pooja for PM Modi

మరోవైపు లండన్ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh)… ప్రధాని మోదీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. లండన్‌ లోని ఇస్కాన్ ఆలయంలో మోదీ పేరు మీద ప్రత్యేక పూజలు నిర్వహించారు. మోదీకి దీర్ఘాయుష్షు కలగాలని భగవంతుడిని ప్రార్థించినట్లు తెలిపారు. అలాగే, మోదీ మార్గదర్శకత్వంలో వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధిస్తామనే నమ్మకం ఉందని మంత్రి లోకేశ్ తన సోషల్ మీడియాలో తెలిపారు.

ఇది ఆరంభం మాత్రమే – నారా లోకేశ్‌

స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ను చేతల్లో చూపిస్తున్నామని ఏపీ మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. యూకేలో బిజినెస్‌ ఫోరమ్‌ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సీఎం చంద్రబాబు వల్లే 15 నెలల్లో ఏపీకి రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. క్వాంటమ్‌ వ్యాలీ, డేటా సిటీలతో ఏపీ రూపురేఖలు మారిపోతాయన్నారు. పరిశ్రమల స్థాపనకు ప్రతిబంధకంగా ఉన్న నిబంధనలను సవరిస్తున్నట్లు వివరించారు.

‘‘భారతదేశంలో అతిపెద్ద స్టీల్ ప్లాంట్‌ను ఆర్సెలార్‌ మిత్తల్‌ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయబోతోంది. నవంబర్‌లో దీని నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. దేశంలో అతిపెద్ద డేటా సెంటర్ త్వరలో విశాఖపట్నానికి రాబోతోంది. టీసీఎస్ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలను రాష్ట్రానికి రప్పించేందుకు మేం ఎకరా 99 పైసలకే భూములు ఇచ్చాం. మా వద్ద కొత్తతరం యువ నాయకత్వం ఉంది. మొత్తం శాసనసభలో 50 శాతం తొలిసారి గెలిచినవారున్నారు. మంత్రివర్గంలోని 25 మందిలో 17 మంది కొత్తవారే. వారందరికీ స్టార్టప్ మైండ్‌సెట్ ఉంది. ఆంధ్రప్రదేశ్ ఒక స్టార్టప్ స్టేట్. మేమంతా రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలన్న తపన, పట్టుదలతో పనిచేస్తున్నాం.

దక్షిణాసియాలో తొలి 158 బిట్ క్వాంటమ్ కంప్యూటర్ జనవరిలో అమరావతికి రాబోతోంది. ప్రధాని మోదీ క్వాంటమ్ మిషన్‌ను ముందుండి నడిపించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. దీని ద్వారా అమరావతిలో అద్భుతమైన ఎకో సిస్టమ్ ఏర్పాటు కాబోతోంది. విశాఖలో డేటా సిటీ నిర్మాణం వల్ల అక్కడ కేబుల్స్ ల్యాండ్ అవుతాయి. ముంబయి కన్నా రెట్టింపు సామర్థ్యంతో 1.5 గిగావాట్ల డేటా సెంటర్స్ విశాఖకు రాబోతున్నాయి. రాబోయే మూడేళ్లలో అవి పూర్తవుతాయి. ఇది ఆరంభం మాత్రమే.. ఇంకా ఎన్నో ప్రతిష్ఠాత్మక సంస్థలతో చర్చలు జరుపుతున్నాం’’ అని లోకేశ్‌ వివరించారు.

Also Read : CM Chandrababu: గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ బిజినెస్ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు

Leave A Reply

Your Email Id will not be published!