Nara Lokesh : విజయవాడ – టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శనివారం ట్విట్టర్ వేదికగా స్పందించారు. తన తండ్రి నారా చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్ట్ చేసి రాజమండ్రి జైలులో పెట్టడాన్ని తీవ్రంగా నిరసించారు ఐటీ ఉద్యోగులు.
Nara Lokesh Comments viral
ఈ సందర్బంగా బెంగళూరు, హైదరాబాద్ లోని వివిధ రంగాలకు చెందిన ఐటీ ఉద్యోగులు రోడ్డు పైకి వచ్చారు. చంద్రబాబు నాయుడుకు మద్దతుగా నిలిచారు. ఆయనను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ తో పాటు బెంగళూరు, తదితర నగరాలలో ఐటీ ఎంప్లాయిస్ తన తండ్రికి మద్దతు పలకడాన్ని స్వాగతించారు టీడీపీ నేత నారా లోకేష్.
మీ అందరికీ ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నానని పేర్కొన్నారు. ఇదే మద్దతు తన తండ్రి బయటకు వచ్చేంత వరకు చేయాలని కోరారు. దీనిని ప్రతి ఒక్కరు ఖండించాలని పిలుపునిచ్చారు నారా లోకేష్(Nara Lokesh). ఇదిలా ఉండగా ఏపీ స్కిల్ స్కాం కేసులో నారా చంద్రబాబు నాయుడుపై ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది.
ఏసీబీ కోర్టులో ప్రవేశ పెట్టడంతో జడ్జి హిమ బిందు బాబుకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ తీర్పు చెప్పారు ఏసీబీ కోర్టు జడ్జి బీఎస్వీ హిమ బిందు. దీంతో విజయవాడ నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.
Also Read : AP CM YS Jagan : చంద్రబాబుకు జైలే గతి – జగన్
