Narendra Modi: ఎన్టీఆర్ ఎంతో దార్శనికత గల నాయకుడు – ప్రధాని మోదీ
ఎన్టీఆర్ ఎంతో దార్శనికత గల నాయకుడు - ప్రధాని మోదీ
Narendra Modi: దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఎంతో దార్శనికత గల నాయకుడని ప్రధాని నరేంద్రమోదీ(Narendra Modi) పేర్కొన్నారు. ఎన్టీఆర్ 101వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ తన సోషల్ మీడియా ఎక్స్ (ట్విటర్) వేదికగా ఎన్టీఆర్ ను స్మరించుకుంటూ ప్రత్యేకంగా ట్వీట్ చేసారు.
‘‘ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆ మహనీయుణ్ణి స్మరించుకుంటున్నాం. తెలుగు సినీ రంగంలో విశిష్ట నటుడైన ఆయన… ఎంతో దార్శనికత గల నాయకుడు. సినీ, రాజకీయ రంగాలకు ఎన్టీఆర్ చేసిన సేవలు తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయి. తెరపై ధరించిన పాత్రలను, ఆయన నాయకత్వ పటిమను ప్రజలు ఇప్పటికీ తలచుకుంటారు. ఎన్టీఆర్ కలలుగన్న సమాజం కోసం మేము నిరంతరం పని చేస్తాం’’ అని మోదీ పేర్కొన్నారు.
Narendra Modi – మోదీ పోస్ట్ కు స్పందించిన చంద్రబాబు !
ప్రధాని నరేంద్ర మోదీ చేసిన పోస్ట్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. ఎన్టీఆర్ ఆశయసాధనకు కలిసి పనిచేద్దామన్నారు. ‘‘ఎన్టీఆర్ తెర ముందు… తెర వెనకా ఓ లెజెండే. ఆయన అందించిన నిస్వార్థ ప్రజాసేవ మనందరికీ స్ఫూర్తి. భవిష్యత్తు తరాలకు బాటలు వేసే విధంగా అందరి హృదయాల్లో అది ప్రకాశిస్తోంది’’ అని చంద్రబాబు తన ట్వీట్ లో పేర్కొన్నారు.
ఎన్టీఆర్‌కు ‘భారతరత్న’ పురస్కారంతోనే సముచిత గౌరవం – చిరంజీవి
దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రముఖ సినీనటుడు చిరంజీవి నివాళులర్పించారు. ఆయన కీర్తి భావితరాలకు ఆదర్శమని కొనియాడారు. ఈ మేరకు ఎన్టీఆర్‌తో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఫొటోను ఎక్స్ (ట్విటర్)లో పోస్ట్ చేశారు. ‘‘కొందరి కీర్తి అజరామరం… భావితరాలకు ఆదర్శం. నందమూరి తారక రామారావు గారిని ఈరోజు గుర్తుచేసుకుంటున్నాను. ప్రజా జీవితంలో ఆయన చేసిన సేవలకు ‘భారతరత్న’ పురస్కారం సముచిత గౌరవమని భావిస్తున్నాను. తెలుగువారి ఈ చిరకాల కోరికను కేంద్ర ప్రభుత్వం తప్పక మన్నిస్తుందని ఆశిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.
Also Read : Mallikarjun Kharge : బీజేపీకి 400 కాదుకదా 200 సీట్లు వస్తాయి