Narendra Modi: 72 మందితో కొలువుతీరిన మోదీ 3.0 కేబినెట్ !

72 మందితో కొలువుతీరిన మోదీ 3.0 కేబినెట్ !

Narendra Modi: సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా 72 మంతో కొత్త మంత్రివర్గం ఏర్పాటైంది. వీరిలో 30 మంది క్యాబినెట్, ఐదుగురు స్వతంత్ర, 36 సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వీరితో ప్రమాణం చేయించారు. రాష్ట్రపతి భవన్‌ ప్రాంగణంలో అట్టహాసంగా కొనసాగిన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం… 8వేల అతిథులతో కిక్కిరిసిపోయింది.

Narendra Modi Cabinet

మొత్తం 72 మందితో కేంద్ర మంత్రివర్గం కొలువుదీరగా… వీరిలో 30 మంది కేబినెట్‌ మంత్రులు కాగా, మిగతావారు స్వతంత్ర, సహాయ మంత్రులుగా ప్రమాణం చేశారు. మోదీతో పాటు రాజ్‌నాథ్‌ సింగ్‌, అమిత్‌ షా, నితిన్‌ గడ్కరీ, నిర్మలా సీతారామన్‌, ఎస్‌ జైశంకర్‌లు కూడా క్యాబినెట్‌ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఐదేళ్ల తర్వాత తిరిగి మంత్రివర్గంలోకి వచ్చారు. మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌, మాజీ సీఎం మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌లు మోదీ కేబినెట్‌లోకి తొలిసారి అడుగుపెట్టారు. బీజేపీ సీనియర్‌ నేతలు పీయూష్ గోయల్‌, జ్యోతిరాదిత్య సింధియా, ధర్మేంద్ర ప్రధాన్‌, భూపేంద్ర యాదవ్‌ వంటి నేతలు మంత్రివర్గంలో తిరిగి చోటు దక్కించుకున్నారు. మొన్నటివరకు రాజ్యసభ సభ్యులుగా ఉన్న వీరు… తాజా లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొందారు. అస్సాం మాజీ సీఎం సర్బానంద సోనోవాల్‌, అశ్వినీ వైష్ణవ్‌, వీరేంద్ర కుమార్‌, ప్రహ్లాద్‌ జోషి, గిరిరాజ్‌ సింగ్‌, జుయల్‌ ఓరం వంటి బీజేపీ నేతలకు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

క్యాబినెట్‌ మంత్రులు వీరే !

నరేంద్రమోదీ(Narendra Modi), రాజ్‌నాథ్‌సింగ్‌, అమిత్‌ షా, నితిన్‌ గడ్కరీ, జేపీ నడ్డా, శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌, నిర్మలా సీతారామన్‌, ఎస్‌. జై శంకర్‌, మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌, పీయూష్‌ గోయల్‌, ధర్మేంద్ర ప్రధాన్‌, సర్బానంద సోనోవాల్‌, వీరేంద్ర కుమార్‌, ప్రహ్లాద్‌ జోషి, జుయల్‌ ఓరం, గిరిరాజ్‌ సింగ్‌, అశ్వనీ వైష్ణవ్‌, జ్యోతిరాదిత్య సింథియా, భూపేంద్ర యాదవ్‌, గజేంద్రసింగ్‌ షెకావత్‌, అన్నపూర్ణాదేవి, కిరణ్‌ రిజిజు, హర్దీప్‌ సింగ్‌, మన్‌సుఖ్‌ మాండవీయ, కిషన్‌ రెడ్డి, ఇంద్రజీత్‌ సింగ్‌, జితేంద్ర సింగ్‌, అర్జున్‌ రామ్‌ మేఘవాల్‌, ప్రతాప్‌ రావ్‌ గణపత్‌ రావు జాదవ్‌, రామ్మోహన్‌ నాయుడు, జేడీఎస్‌ నేత కుమారస్వామి, జితన్‌ రాం మాంఝీ, జేడీయూ నేత లలన్‌ సింగ్‌, ఎల్జేపీ నేత చిరాగ్‌ పాసవాన్‌

సహాయ మంత్రులు వీరే !

జయంత్‌ చౌదరి, జితిన్‌ ప్రసాద్‌, శ్రీపాద్‌ యశో నాయక్‌, పంకజ్‌ చౌదరి, క్రిషన్‌ పాల్‌, రాందాస్‌ అఠవలే, రామ్‌నాథ్‌ ఠాకూర్‌, నిత్యానంద్‌ రాయ్‌, అప్నాదళ్‌ అధ్యక్షురాలు అనుప్రియా పటేల్‌, సోమన్న, పెమ్మసాని చంద్రశేఖర్‌, ఎస్పీ సింగ్‌ బఘేల్‌, శోభా కరంద్లాజే, కీర్తి వర్థన్‌ సింగ్‌, బీఎల్‌ వర్మ, శాంతను ఠాకూర్‌, సురేశ్‌ గోపి, ఎల్‌ మురుగన్‌, అజయ్‌ తంప్టా, బండి సంజయ్‌, కమలేశ్‌ పాసవాన్‌, భగీరథ్‌ చౌదరి, సతీశ్‌ చంద్ర దూబె, సంజయ్‌ సేథ్‌, రవ్‌నీత్‌ సింగ్‌, దుర్గాదాస్‌ ఉయికె, రక్షా నిఖిల్‌ ఖడ్సే, సుఖాంత్‌ మజుందార్‌, సావిత్రి ఠాకూర్‌, తోకన్‌ సాహు,
రాజ్‌ భూషణ్‌ చౌధరి, భూపతి రాజు శ్రీనివాస్‌ వర్మ, హర్ష మల్హోత్రా, నిముబెన్‌ బంభానియా, మురళీధర్‌ మొహోల్‌, జార్జ్‌ కురియన్‌, పబిత్ర మార్గెరెటా

కేబినెట్ మంత్రులు ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు భారతదేశ ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ(Narendra Modi) ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. 2014లో మోదీ(Narendra Modi) తొలిసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. 2019లోనూ విజయం సాధించి తిరుగులేని నేతగా ఎదిగారు. 2024 ఎన్నికల్లోనూ ఎన్డీయేకు 293 స్థానాలు దక్కడంతో మళ్లీ ప్రధానిగా పగ్గాలు చేపట్టే అవకాశం లభించింది. దీనితో మూడో సారి ప్రధాన మంత్రిగామోదీ(Narendra Modi) ప్రమాణ స్వీకారం చేసారు. ఈ కార్యక్రమానికి దాదాపు 8వేల మంది దేశ, విదేశీ ప్రముఖులతో పాటు సార్క్‌ సభ్య దేశాల నేతలు హాజరయ్యారు. సుప్రీంకోర్టు సీజే జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెదేపా అధినేత చంద్రబాబు, జేడీయూ అధినేత నీతీశ్‌ కుమార్‌, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ, సినీనటులు షారుక్‌ ఖాన్‌, రజనీకాంత్‌తో పాటు ఆధ్యాత్మికవేత్త చినజీయర్‌ స్వామి, పలు పీఠాలకు చెందిన అధిపతులు తరలివచ్చారు.

వరుసగా మూడో సార్వత్రిక ఎన్నికల్లోనూ బీజేపీను విజయపథంలో నడిపించిన నరేంద్ర మోదీ(Narendra Modi)… తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ తర్వాత అంతటి ఘనత సాధించిన నేతగా చరిత్ర సృష్టించారు. నెహ్రూ తర్వాత ఏ ప్రధానీ వరుసగా మూడుసార్లు తమ సారథ్యంలోని పార్టీలను ఈ స్థాయిలో గెలిపించిన దాఖలాల్లేవు. 1950 సెప్టెంబరు 17న గుజరాత్‌లోని పేద కుటుంబంలో జన్మించిన మోదీ… రాజకీయాల్లో ఒక్కో మెట్టు ఎక్కుతూ 2001లో తొలిసారి గుజరాత్‌ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. తనదైన నాయకత్వ పటిమతో వరుసగా 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో జాతీయ స్థాయిలో కమలం పార్టీకి సంపూర్ణ మెజార్టీ సాధించిపెట్టారు.

Also Read : Kollu Ravindra : ఆకస్మిక తనిఖీలతో అధికారులకు టెన్షన్ పుట్టిస్తున్న కోల్లు రవీంద్ర

Leave A Reply

Your Email Id will not be published!