National Pension Scheme : జాతీయ పెన్షన్ పథకం ఓ వరం
చిన్న..మధ్య తరగతి వర్గాలకు భరోసా
National Pension Scheme : ప్రస్తుత పరిస్థితుల్లో ప్రైవేట్ రంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. పీవీ నరసింహారావు తీసుకు వచ్చిన ఆర్థిక సంస్కరణలు పెద్ద ఎత్తున ప్రైవేట్ రంగం , వ్యాపారవేత్తలు, కార్పొరేట్లు మార్కెట్ లోకి వచ్చేందుకు వీలు కల్పించింది. ఇదే సమయంలో కోట్లాది మంది ప్రైవేట్ రంగంలో పని చేస్తున్నారు.
ఇక గతంలో పెన్షన్ స్కీం అన్నది ప్రతి ఒక్కరికీ వర్తించేది. కానీ సీన్ మారింది ఇప్పుడు ప్రభుత్వ రంగం కంటే ప్రైవేట్ రంగమే కీలక పాత్ర పోషిస్తూ వస్తోంది. ఇందులో భాగంగా భారత దేశంలో 137 కోట్ల మందికి పైగా జనాభా ఉంది. ఇందులో పేదలు, చిన్న, మధ్య తరగతి ప్రజలకు మేలు చేకూర్చేలా నెల నెలా భరోసా కల్పించేందుకు గాను జాతీయ పెన్షన్ పథకంను తీసుకు వచ్చింది.
ప్రధానంగా ప్రైవేట్ సెక్టార్ లో పని చేస్తున్న వారికి నెల నెలా పెన్షన్(National Pension Scheme) పొందే సౌకర్యాన్ని ఎన్పీఎస్. ఏ జాబ్ చేస్తున్నా , ఏ రంగంలో ఉన్నా ..ఎవరైనా సరే ఈ పథకంలో చేరే అవకాశం ఉంది. ఇందులో ఎంత పెట్టాలనేది రూల్ ఏమీ లేదు. స్వల్పంగా రూ. 500 నుంచి గరిష్టంగా ఎంత మొత్తంలోనైనా ఇన్వెస్ట్ చేయొచ్చు.
ఈ సౌలభ్యాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోం చేసుకోగలిగితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అందరికీ మేలు చేకూర్చేందుకు గాను కేంద్ర సర్కార్ 2003లో జాతీయ పెన్షన్ పథకాన్ని తీసుకు వచ్చింది. పన్ను ప్రయోజనం కూడా ఉంటుంది. మొదట్లో కేవలం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే అందుబాటులో ఉండేది.
కానీ 2009లో చట్టం మార్చుతూ ఎవరైనా సరే భారత పౌరులు ఇందులో చేరేలా మార్పు చేసింది. ఇందులో చేరేందుకు 18 ఏళ్ల నుంచి 70 ఏళ్ల వరకు ఎవరైనా చేరే వీలుంది. ఎవరైనా సులువుగా చేరొచ్చు. ఎన్పీఎస్ వెబ్ పోర్టల్ లేదా ఇతర బ్యాంకులు, పోస్ట్ ఆఫీసులలో ఓపెనింగ్ చేయొచ్చు. 60 ఏళ్ల తర్వాత దీనిని తీసుకునే వీలుంది.
ఎంతో అద్భుతమైన ఈ పథకాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది.
Also Read : మోదీ మోసం రైతులు పోరాటానికి సిద్దం