Neera Cafe : ప్రారంభానికి సిద్దం ‘నీరా’ సన్నద్దం
మే 3న కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్ ప్రారంభం
Neera Cafe : అంతా ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న నీరా కేఫ్ ప్రారంభమానికి సిద్దమైంది. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఏర్పాట్లను పరిశీలించారు. మే 3న మంత్రి కేటీఆర్ తో కలిసి నీరా కేఫ్(Neera Cafe) ను ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఎక్సైజ్ శాఖ నీరా సేకరణ, నిల్వ, ప్యాకింగ్ పై ట్రయల్ రన్ ను విజయవంతంగా నిర్వహించింది. దీంతో మద్యంగా మారక ముందే స్వచ్ఛమైన నీరాను వినియోగదారునికి అందజేసేందుకు సిద్దమైంది. దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. నగర వాసులు నీరా రుచి చూసేందుకు తెగ ముచ్చట పడుతున్నారు.
రంగారెడ్డి జిల్లా ముద్విన్ లోని నీరా సేకరణ కేంద్రాన్ని పైలట్ ప్రాజెక్టుకుగా ఎంపిక చేశారు. గౌడన్నలకు ఉపాధి కల్పించడం, ప్రజలకు స్వచ్ఛమైన నీరాను అందించేందుకు మంత్రి విరసనోళ్ల శ్రీనివాస్ గౌడ్ కృషి చేస్తున్నారు. ఇదిలా ఉండగా భువనగిరి జిల్లా నందన్ , రంగారెడ్డి జిల్లా ముద్విన్ , సంగారెడ్డి జిల్లా మునిపల్లి, నల్గొండ జిల్లా సర్వేల్లో నీరా సేకరణ కేంద్రాలు ఉన్నాయి. వీటికి రాష్ట్ర సర్కార్ రూ. 8 కోట్లు మంజూరు చేసింది.
చెట్టు నుంచి స్వచ్ఛంగా తయారయ్యే నీరాను చేతులతో తాకకుండా అదే స్వచ్ఛతతో వినియోగదారునికి అందేలే ఎక్సైజ్ శాఖ పారదర్శక విధానాన్ని అమలు చేస్తోంది. ఇందు కోసం కేరళ తరహాలో 5 లీటర్ల సామర్థ్యం ఉన్న మట్టి కుండలను ప్రత్యేకంగా సిద్దం చేశార. కేరళ నుంచి 2 వేలకు పైగా చిల్లర్ బాక్సులను రాష్ట్రానికి తీసుకు వస్తున్నారు. వీటిలో నీరా(Neera Cafe) చెడి పోకుండా ఉంటుంది.
ఇదిలా ఉండగా ఇతర రాష్ట్రాలు నీరా వంటి సహజ పానీయాలను నిల్వ చేసేందుకు కొన్ని ప్రిజర్వేటివ్ లను ఉపయోగిస్తున్నాయి. కానీ ఇక్కడ అలాంటి వాటిని ఉపయోగించకుండా స్వచ్ఛమైన నీరాను అందజేస్తామని స్పష్టం చేశారు ఎక్సైజ్ శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్. మొత్తంగా నగర ప్రియులకు నీరా మరింత ఆహ్లాదాన్ని, ఆరోగ్యాన్ని కలగ చేస్తుందని అనుకుంటున్నారు.
Also Read : ప్రజా సంక్షేమం అభివృద్ది నినాదం