AP High Court: హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ జ్యోతిర్మయి, జస్టిస్ గోపాలకృష్ణారావు !
హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ జ్యోతిర్మయి, జస్టిస్ గోపాలకృష్ణారావు !
AP High Court: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప, జస్టిస్ వెణుతురుమల్లి గోపాలకృష్ణారావు ప్రమాణం చేశారు. బుధవారం హైకోర్టులో జరిగిన కార్యక్రమంలో వీరిద్దరితో ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ ప్రమాణం చేయించారు. అదనపు న్యాయమూర్తులుగా పనిచేస్తున్న జస్టిస్ వెంకట జ్యోతిర్మయి, జస్టిస్ గోపాలకృష్ణారావులను శాశ్వత న్యాయమూర్తులుగా నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. వీరి నియామకానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఇటీవల ఆమోద ముద్ర వేసి, ఉత్తర్వులు జారీ చేశారు. దీనితో ఇరువురు న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి రాష్ట్రపతి ముర్ము జారీ చేసిన ఉత్తర్వులను రిజిస్ట్రార్ జనరల్ వై.లక్ష్మణరావు చదివి వినిపించారు.
AP High Court…
ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో న్యాయమూర్తులు, విశ్రాంత న్యాయమూర్తులు జస్టిస్ రాకేశ్ కుమార్, జస్టిస్ మంతోజు గంగారావు, అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, అదనపు ఏజీ ఇవన సాంబశివ ప్రతాప్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణ, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కలిగినీడి చిదంబరం, ప్రమాణం చేసిన న్యాయమూర్తుల కుటుంబసభ్యులు, న్యాయవాదులు పాల్గొన్నారు.
Also Read : Nuzivid IIIT: నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఫుడ్ పాయిజనింగ్ ! వెయ్యిమంది విద్యార్థులకు అస్వస్థత !