Nicholas Pooran : ఐపీఎల్ 16వ సీజన్ లో మరోసారి మెరుపులు మెరిపించింది కేఎల్ సారథ్యంలోని లక్నో సూపర్ జెయింట్స్ . ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 257 రన్స్ చేసింది. పంజాబ్ బౌలర్లకు చుక్కలు చూపించింది. కైల్ మేయర్స్ 24 బంతులు ఆడి 54 రన్స్ చేస్తే , ఆసిస్ స్టార్ మార్కస్ స్టోయినిస్ 40 బాల్స్ ఆడి 72 రన్స్ చేశాడు. ఆ తర్వాత ఆయుష్ బడోని దంచి కొట్టాడు. 43 రన్స్ చేశాడు.
కేవలం 19 బంతులు ఎదుర్కొన్న నికోలస్ పూరన్(Nicholas Pooran) 45 కీలకమైన పరుగులు చేశాడు. జట్టు స్కోర్ లో కీలక పాత్ర పోషించారు. కెప్టెన్ కేఎల్ రాహుల్ తక్కువ స్కోర్ కే పెవిలియన్ బాట పట్టినా ఎక్కడా తగ్గలేదు లంక బ్యాటర్లు. ఐపీఎల్ తాజా సీజన్ లో భారీ స్కోర్ తో రికార్డు చేసింది. గతంలో ఆర్సీబీ పూణే వారియర్స్ పై నమోదు చేసిన అత్యధిక స్కోర్ ఇంకా అలాగే ఉంది.
ఇక పంజాబ్ కింగ్స్ ఎలెవన్ తో జరిగిన మ్యాచ్ లో భారీ స్కోర్ టాప్ లో నిలిచింది. ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ ,కోల్ కతా నైట్ రైడర్స్ భారీ స్కోర్ నమోదు చేసింది. 2013లో పూణేపై ఆర్సీబీ 5 వికెట్లు కోల్పోయి 263 రన్స్ చేసింది. ఈ స్కోర్ లో ఆర్సీబీ తరపున ఆడిన విండీస్ స్టార్ క్రిస్ గేల్ ఒక్కడే 175 పరుగులు చేశాడు. పూణేకు చుక్కలు చూపించాడు. ఇద్దరు ఆటగాళ్లు హాఫ్ సెంచరీ నమోదు చేశారు.
Also Read : అదరకొట్టిన ఆయుష్ బడోని