Nikhat Zareen : తెలంగాణ బిడ్డ బాక్సింగ్ లో జగజ్జేత
చరిత్ర సృష్టించిన నిఖత్ జరీన్
Nikhat Zareen : ఐపీఎల్ లో తెలంగాణ కుర్రాడు తిలక్ వర్మ అద్భుతంగా రాణిస్తూ సత్తా చాటితే ఇదే ప్రాంతానికి చెందిన మహిళా బాక్సర్ నిఖత్ జరీన్ అరుదైన ఘనతను సాధించింది.
అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రపంచ ఛాంపియన్ షిప్ లో 52 కేజీల ఫ్లయి వెయిట్ కేటగిరలో ప్రపంచ విజేతగా నిలిచింది. అందరినీ విస్తు పోయేలా చేసింది.
ఇస్తాంబుల్ లో జరిగిన కీలకమైన ఫైనల్ మ్యాచ్ లో నిఖత్ తన పంచ్ లతో దుమ్ము రేపింది. థాయ్ లాండ్ బాక్సర్ జిత్ పాంగ్ జుతమాస్ తో జరిగిన టైటిల్ పోరులో జరీన్ ఏకంగా 5-0తో ఓడించి తనకు ఎదురే లేదని చాటింది.
బంగారు పతకాన్ని సాధించింది. ఆమె విసిరిన అద్భుతమైన పంచ్ లకు అభిమానులు ఫిదా అయ్యారు. జడ్జీలు సైతం జే కొట్టారు. 30-27, 29-28, 29-28, 30-27, 29-28 తేడాతో పాయింట్లు సాధించింది.
ఎక్కడా ప్రత్యర్థి బాక్సర్ కు అవకాశం ఇవ్వలేదు నిఖత్ జరీన్(Nikhat Zareen). ఇదిలా ఉండగా భారత బాక్సింగ్ చరిత్రలో ఇప్పటి వరకు ప్రపంచ ఛాంపియన్ గా నిలిచిన ఐదో బాక్సర్ గా నిలిచింది.
2018లో మేరీ కోమ్ చివరి సారిగా ఛాంపియన్ గా నిలిస్తే అంటే నాలుగు సంవత్సరాల తర్వాత తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ ప్రపంచ వేదికపై విజేతగా నిలిచింది.
ప్రపంచ ఛాంపియన్ గా నిలిచి తెలంగాణకు గర్వకారణమైన నిఖత్ జరీన్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు అభినందించారు. ఆమెకు ప్రభుత్వం తరపున సహకారం తప్పక ఉంటుందన్నారు సీఎం.
Also Read : రాజస్థాన్ చెన్నై నువ్వా నేనా