Nilofar Khan : కాశ్మీర్ యూనివర్శిటీ వీసీగా నీలోఫర్ ఖాన్
యూనివర్శిటీకి మొట్ట మొదటి మహిళా వీసీ
Nilofar Khan : కాశ్మీర్ యూనివర్శిటీకి మొదటిసారిగా మహిళా వైస్ ఛాన్స్ లర్ ( ఉప కులపతి)ని నియమించింది ప్రభుత్వం. వీసీగా నీలోఫర్ ఖాన్ నియమితులయ్యారు.
కాశ్మీర్ యూనివర్శిటీ ఛాన్సలర్ హోదాలో జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా శుక్రవారం వెల్లడించారు. ఈ మేరకు నియామక ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఇదిలా ఉండగా నీలోఫర్ ఖాన్(Nilofar Khan) కు టీచింగ్ లో 30 ఏళ్ల పాటు అనుభవం ఉంది. శనివారం ఆమె కాశ్మీర్ యూనివర్శిటీ వీసీగా బాధ్యతలు చేపట్టే చాన్స్ ఉంది.
కాగా ప్రస్తుతం నీలోఫర్ ఖాన్ హోం సైన్స్ విభాగంలో ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు. ఆగస్టు 2018లో కాశ్మీర్ యూనివర్శిటీకి వీసీగా ఉన్న ప్రొఫెసర్ తలత్ అహ్మద్ రెండు సంవత్సరాల పదవీ కాలాన్ని పూర్తి చేశారు.
దీంతో ఆయన పదవీ కాలం ముగియడంతో అనుభవం కలిగిన నీలోఫర్ ఖాన్(Nilofar Khan) కు అవకాశం దక్కింది. కాగా విశ్వ విద్యాలయం చరిత్రలో మొట్ట మొదటిసారిగా మహిళా వీసీగా నియమితులు కావడం రికార్డుల్లోకి ఎక్కారు.
అంతే కాదు ఆమె మరో చరిత్ర కూడా సృష్టించారు. అదేమిటంటే నీలోఫర్ ఖాన్ స్టూడెంట్ వెల్ఫేర్ డీన్ గా పని చేశారు. ఈ పదవిని చేపట్టిన తొలి మహిళా ప్రొఫసర్ గా కూడా ఆమె నిలిచారు.
ఇక విశ్వ విద్యాలయాన్ని 1948లో ఏర్పాటు చేశారు. అనంతరం 1969లో దానిని శ్రీనగర్ కేంద్రంగా కశ్మీర్ యూనివర్శిటీ, జమ్ము కేంద్రంగా జమ్మూ యూనివర్శీటీగా విభజించారు. చాల్ సరస్సు ఒడ్డున 247 ఎకరాలలో విస్తరించి ఉంది ఈ యూనివర్శిటీ.
Also Read : ఎన్నారై స్వాతి ధింగ్రాకు కీలక పదవి