OLA EV Plant Tamil Nadu : తమిళనాడులో ఓలా ప్లాంట్
విద్యుత్ వాహనాల తయారీ
OLA EV Plant Tamil Nadu : విద్యుత్ వాహనాల తయారీ సంస్థ ఓలా సంచలన ప్రకటన చేసింది. తమిళనాడులో అత్యాధునిక ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి సంబంధించి ప్లాంటును ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఓలా ఈవీ హబ్ ను దాదాపు 2,000 ఎకరాల స్థలంలో ఉండేలా చూస్తామని వెల్లడించింది. ఓలా విద్యుత్ వాహనాల(OLA EV Plant) తయారీ సంస్థ తమిళనాడు(Tamil Nadu) రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రభుత్వంతో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.
ఈ ప్లాంట్ లో విద్యుత్ కార్లు, లిథియం – అయాన్ సెల్ ల ఉత్పత్తతిని తయారు చేసేందుకు రూ. 7,614 కోట్ల పెట్టుబడులు పెట్టింది. ఓలా సంస్థ ఏర్పాటుతో రాష్ట్రంలో 3,111 మందికి ఉద్యోగాలు లభిస్తాయని తెలిపింది. ఈ సందర్భంగా ఓలా కంపెనీ సిఇఓ భవిష్ అగర్వాల్ కీలక ప్రకటన చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాబోయే 25 ఏళ్లను దృష్టిలో పెట్టుకుని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.
దీనిని అమృత్ కాల్ గా భావించారు. ఇది మన దశాబ్దం, మన భవిష్యత్తును నిర్మించు కునేందుకు మనకు లభించిన గొప్ప అవకాశమని పేర్కొన్నారు ఓలా సిఇఓ. ఓలా ఈవీ హబ్ మొత్తం ఈవీ పర్యావరణ వ్యవస్థను ఒకే పైకప్పు కిందకు తీసుకు వస్తుంది. ఇది ద్విచక్ర వాహనాలతో పాటు ఫోర్ వీలర్లను కూడా తయారు చేస్తామని స్పష్టం చేశారు భవిష్ అగర్వాల్.
ఇదిలా ఉండగా గత ఏడాది 2022లో ఓలా మొదటి లిథియం అయాన్ సెల్ ఎన్ఎంసీ -2170ని ఆవిష్కరించింది. దీనిని బెంగళూరులోని అత్యాధునిక బ్యాటరీ ఇన్నోవేషన్ సెంటర్ లో $500 మిలియన్ల పెట్టుబడితో నిర్మించింది ఓలా కంపెనీ.
Also Read : చాట్ జీపీటీపై గూగుల్ ఫోకస్