RRR Naatu Naatu Song : 12న నాటు నాటు ప్ర‌ద‌ర్శన‌

ఆస్కార్ వేదిక‌పై అద్భుత అవ‌కాశం

RRR Naatu Naatu Song : ద‌ర్శ‌క ధీరుడు ఎస్ ఎస్ రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఆర్ఆర్ఆర్ మూవీ ప్ర‌పంచ వ్యాప్తంగా ఆద‌ర‌ణ చూర‌గొంటోంది. ఇప్ప‌టికే ప‌లు అవార్డులు స్వంతం చేసుకుంది. హాలీవుడ్ లో సైతం చ‌ర్చ‌కు దారి తీసేలా చేసింది ఆర్ఆర్ఆర్ మూవీ. జూనియ‌ర్ ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ , ఆలియా భ‌ట్ క‌లిసి న‌టించిన ఈ చిత్రం కోట్లు కొల్ల‌గొట్టింది. దిగ్గ‌జ ద‌ర్శ‌కుల మ‌న‌సు దోచుకుంది. అంతే కాదు ప్ర‌తిష్టాత్మ‌క‌మైన అవార్డుల‌ను స్వంతం చేసుకుంది.

ప్ర‌స్తుతం ఆస్కార్ అవార్డుల రేసులో నిలిచింది జ‌క్క‌న్న ఆర్ఆర్ఆర్ చిత్రం. ఎంఎం కీర‌వాణి ఈ చిత్రానికి సంగీతం అందించారు. ప్ర‌ధానంగా నాటు నాటు సాంగ్ దుమ్ము రేపుతోంది. దీనిని తెలంగాణ ప్రాంతానికి చెందిన చంద్ర‌బోస్ రాశారు. కాల భైర‌వ‌, రాహుల్ సిప్లిగంజ్ పాడారు. ఇక ఓరిజిన‌ల్ సాంగ్ కేట‌గిరీలో ఆర్ఆర్ఆర్ నుంచి నాటు నాటు(RRR Naatu Naatu Song)  ఎంపికైంది. ఆస్కార్ అవార్డుల ప్ర‌దానోత్స‌వం మార్చి 12న జ‌ర‌గ‌నుంది.

ఇందులో భాగంగా నాటు నాటు పాట‌ను ప్ర‌త్య‌క్షంగా ప్ర‌ద‌ర్శ‌న చేయ‌నున్నారు. ఈ విష‌యాన్ని ఆస్కార్ అవార్డుల క‌మిటీ అధికారికంగా ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు ట్విట్ట‌ర్ వేదిక‌గా తెలిపింది. అంత‌ర్జాతీయ వేదిక‌పై తెలుగు సినిమాకు సంబంధించి ప్ర‌త్య‌క్షంగా ప్ర‌ద‌ర్శ‌న ఇవ్వ‌డం ఇదే తొలిసారి కానుంది.

ఈ విష‌యాన్ని స్వ‌యంగా పంచుకున్నారు సింగ‌ర్ రాహుల్ సిప్లిగంజ్. ఇది త‌న జీవితంలో మ‌రిచి పోలేని విష‌య‌మ‌ని పేర్కొన్నాడు. పాట ప్ర‌ద‌ర్శ‌న ఇచ్చేందుకు తాను ఎంత‌గానో వేచి చూస్తున్నాన‌ని స్ప‌ష్టం చేశాడు. మ‌రో వైపు దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ సైతం ఆర్ఆర్ఆర్ టీంను ప్ర‌త్యేకంగా అభినందించారు.

Also Read : రూ. 1,000 కోట్లు దాటిన ప‌ఠాన్

Leave A Reply

Your Email Id will not be published!