Pakistan: ప్రధాని, ఆర్మీ చీఫ్‌ మధ్య వైరం అంటూ పాకిస్తాన్ ఫేక్‌ ప్రచారం

ప్రధాని, ఆర్మీ చీఫ్‌ మధ్య వైరం అంటూ పాకిస్తాన్ ఫేక్‌ ప్రచారం

Pakistan : ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో పెద్దఎత్తున ఫేక్‌ ప్రచారానికి తెరలేపిన పాకిస్థాన్‌… దాన్ని ఇంకా కొనసాగిస్తోంది. సామాజిక మాధ్యమాల వేదికగా భారత్‌పై విషం చిమ్ముతోంది. భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని అనుకూల ఎక్స్‌ హ్యాండిళ్ల నుంచి ఒకేతరహా ప్రచారం చేయిస్తోంది. అయితే పాకిస్తాన్ (Pakistan) చేస్తున్న అసత్య ప్రచారంపై స్పందించిన పీఐబీ (ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో) ఫ్యాక్ట్‌ చెక్‌ చేసి సమర్థంగా తిప్పికొట్టింది.

Pakistan Fake Publicity

భారత ప్రధాని నరేంద్రమోదీ, భారత ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఉపేంద్ర ద్వివేదిల మధ్య చెడిందంటూ ఓ కల్పిత ప్రచారానికి పాక్‌ (Pakistan) తెరతీసింది. యుద్ధ సామగ్రిని అప్‌గ్రేడ్‌ చేయకుండా పాక్‌తో వివాదం పెట్టుకోవడం భారత ఆర్మీకి ఏమాత్రం ఇష్టం లేదనేది ఆ పోస్టుల సారాంశం. ఒకేతరహా సందేశం వేర్వేరు అకౌంట్ల నుంచి రావడంతో పీఐబీ ఫ్యాక్ట్‌చెక్‌ విభాగం అప్రమత్తమైంది. ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్న ఈ సమాచారం పూర్తిగా అవాస్తవమని స్పష్టంచేసింది. ఇలాంటి అసత్య ప్రచారాలపై అప్రమత్తంగా ఉండాలంటూ పౌరులకు సూచించింది.

చైనా గోడపై కేరళ సంప్రదాయ నృత్య వైభవం

ప్రపంచ వింతల్లో ఒకటైన చైనా గోడపై భారతీయ కళావైభవం ఉట్టిపడింది. ఓనం పండుగ వేళ కేరళకు చెందిన పలువురు మహిళలు సంప్రదాయ నృత్యం ‘తిరువతిర’తో ఆకట్టుకున్నారు. సంస్కృతి, సంబరాల మేళవింపుగా నిర్వహించిన ఈ ప్రదర్శన అంతర్జాతీయ పర్యాటకుల మనసు దోచుకుంది.

కేరళకు చెందిన 40 మంది సభ్యులతో కూడిన ఓ బృందం ఇటీవల చైనా సందర్శనకు వెళ్లింది. ఓనం సమయంలో పర్యటిస్తున్న నేపథ్యంలో.. తొలుత కేరళ సంప్రదాయ వస్త్రాలు ధరించాలనే ఆలోచన చేశారు. పర్యటనకు మూడు రోజుల ముందు ‘తిరువతిర’ కూడా ప్రదర్శించాలని నిర్ణయించుకున్నారు. దీని కోసం ఆరుగురు మహిళలను ఎంపిక చేశారు.

‘‘నృత్యంలో ఎటువంటి అనుభవం లేనప్పటికీ.. వాట్సప్ ద్వారా కొరియోగ్రఫీ సమన్వయం చేసుకున్నాం. హోటల్ కారిడార్లలో రిహార్సల్స్ నిర్వహించాం. నాలుగు నిమిషాలపాటు మా ప్రదర్శన కొనసాగింది. ఎవరూ అడ్డుచెప్పలేదు. వివిధ దేశాల పర్యాటకులూ ముగ్దులయ్యారు. మా క్షణాలను చిరస్మరణీయంగా మార్చారు’’ అని బృంద సభ్యులు తెలిపారు.

Also Read : Auto Rally: విజయవాడలో కదం తొక్కిన ఆటో, క్యాబ్ కార్మికులు

Leave A Reply

Your Email Id will not be published!