Shazia Marri Slams : భారత్ తో అణు యుద్ధానికి సిద్దం – షాజియా

అణు బాంబు ఉంద‌ని మ‌రిచి పోవ‌ద్దు

Shazia Marri Slams : పాకిస్తాన్ అధికారంలో ఉన్న పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ నాయ‌కురాలు, మంత్రి షాజియా మ‌ర్రి(Shazia Marri)  సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ఆమె భార‌త దేశాన్ని టార్గెట్ చేశారు. మా వ‌ద్ద అణు బాంబు ఉంద‌న్న విష‌యం మ‌రిచి పోవ‌ద్దంటూ హెచ్చ‌రించారు. అవ‌స‌ర‌మైతే యుద్దానికి సిద్దంగా ఉన్నామ‌ని ప్ర‌క‌టించి క‌ల‌క‌లం రేపారు.

తాము మౌనంగా ఉన్నామ‌ని భార‌త్ రెచ్చిపోతే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని పేర్కొన్నారు. తాము అవ‌స‌ర‌మైతే అణు యుద్దం చేసేందుకు రెడీగా ఉన్నామ‌ని స్ప‌ష్టం చేశారు. ఇదిలా ఉండ‌గా ఆ దేశానికి చెందిన విదేశాంగ శాఖ మంత్రి బిలావ‌ల్ భుట్టో జ‌ర్దారీ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీపై నోరు పారేసుకున్నారు.

బిన్ లాడెన్ చ‌ని పోయాడ‌ని కానీ గుజ‌రాత్ క‌సాయి ఇంకా బ‌తికే ఉన్నాడ‌ని అన్నారు. దీనిపై భార‌త్ పెద్ద ఎత్తున నిర‌స‌న తెలిపింది. ఓ అడుగు ముందుకేసి పాకిస్తాన్ ను తీవ్రంగా హెచ్చ‌రించింది. ఇదే స‌మ‌యంలో యావ‌త్ ప్ర‌పంచం పాకిస్తాన్ ను ఉగ్ర‌వాద దేశంగా చూస్తోంద‌ని ప్ర‌క‌టించింది.

తాజాగా స‌రిహ‌ద్దు దాటి వ‌చ్చిన చైనా కు చుక్క‌లు చూపించింది. అంతే కాదు అగ్ని మిస్సైల్ ను ప్ర‌యోగించింది. ఇది ల‌క్ష్యాన్ని నిర్దేశిస్తే వెంటనే చేరుకుని ధ్వంసం చేస్తుంది. దీనిపై తీవ్ర అభ్యంత‌రం తెలిపింది చైనా.

కాగా భార‌త్ చేసిన ప్ర‌యోగం ఒక్క‌సారిగా ప్ర‌పంచాన్ని నివ్వెర పోయేలా చేసింది. భారత్ హెచ్చ‌రిక‌ల నేప‌థ్యంలో షాజియా మ‌ర్రి(Shazia Marri)  స్పందించారు. అవ‌స‌ర‌మైతే తాము వెన‌క్కి త‌గ్గేది లేద‌ని ప్ర‌క‌టించారు.

Also Read : గాల్వాన్ లేదా త‌వాంగ్ ఏదైనా స‌రే

Leave A Reply

Your Email Id will not be published!