Pakistan PM : జింబాబ్వే ప్రెసిడెంట్ పై పాక్ పీఎం ఫైర్
పాకిస్తాన్ జట్టుపై జింబాబ్వే గ్రాండ్ విక్టరీ
Pakistan PM : ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న ఐసీసీ టి20 వరల్డ్ కప్ -2022లో సంచలనాలు చోటు చేసుకుంటున్నాయి. టైటిల్ ఫేవరేట్ గా ఉన్న పాకిస్తాన్ , ఇంగ్లండ్ జట్లకు కోలుకోలేని రీతిలో షాక్ తగిలింది. అక్టోబర్ 27న జింబాబ్వేతో జరిగిన కీలక లీగ్ మ్యాచ్ లో కేవలం ఒకే ఒక్క పరుగు తేడాతో ఓటమి పాలైంది పాకిస్తాన్ జట్టు(PAK vs ZIM T20 World Cup 2022).
దీంతో ప్రపంచ వ్యాప్తంగా జింబాబ్వే ఆటగాళ్ళ పనితీరుకు సర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయి. ఇదే క్రమంలో అత్యంత పటిష్టమైన జట్టుగా పేరొందిన పాకిస్తాన్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు జింబాబ్వే ప్రెసిడెంట్ ఎమ్మెర్సన్ దంబుద్జో(Emmerson Mnangagwa) . జింబాబ్వేను ఆకాశానికి ఎత్తేస్తూనే మరో వైపు పాకిస్తాన్ పై నోరు పారేసుకున్నాడు.
దీంతో రంగంలోకి దిగారు పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్(Pakistan PM) . పాకిస్తానీలకు నిజమైన క్రికెట్ స్పూర్తి ఉందంటూ పేర్కొన్నారు. ఆట అన్నాక గెలుపు ఓటములు సహజమని స్పష్టం చేశాడు. ఒక దేశానికి అధ్యక్షుడిగా ఉన్నత స్థానంలో ఉన్న మీరు పది మందికి ఆదర్శ ప్రాయంగా ఉండాలని సూచించారు.
అవహేళన చేయడం మంచి పద్దతి కాదన్నారు. తాము ఆటను ఆస్వాదిస్తామని కానీ మీరు దానిని వేరే కోణంలో ఆలోచించడం, చూడటం సరైనది కాదని మండిపడ్డారు. మేం ఓడిన ప్రతిసారి తిరిగి లేస్తాం. ఇది మాకు ఉన్న గొప్పనైన పట్టుదల అని పేర్కొన్నారు.
జింబాబ్వేకు చిరస్మరణీయమైన విజయం. మిమ్మల్ని చూసి ఆనందంగా ఉందన్నాడు ప్రెసిడెంట్. ఇదే సమయంలో పాకిస్తాన్ కు ఈ మెగా టోర్నీలో రెండో ఓటమి. మొదటి మ్యాచ్ లో భారత జట్టుతో 4 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది.
Also Read : పసికూనలు భళా పాకిస్తాన్ విలవిల