Pakistan PM : భారత్ దాడులను ఎట్టకేలకు ఒప్పుకున్న పాక్ ప్రధాని

భారత్ దాడులను ఎట్టకేలకు ఒప్పుకున్న పాక్ ప్రధాని

Pakistan PM : పహాల్గాం ఉగ్రదాడికి ప్రతీకార చర్యగా ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్… పాకిస్తాన్ మరియు పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేసిన సంగతి తెలిసిందే. దీనికి ప్రతిదాడిగా పాకిస్తాన్… కూడా సరిహాద్దుల్లో డ్రోన్ల దాడి చేసింది. అయితే పాకిస్తాన్ చేసిన డ్రోన్ల దాడిని సమర్ధవంతంగా తిప్పికొట్టడమేకాకుండా… పాకిస్తాన్ లోని పలు పోర్టులు, ఎయిర్ బేస్ లపై భారత్ మెరుపు దాడి చేసింది. ఈ దాడులతో ఆపార నష్టాన్ని చవిచూసిన పాకిస్తాన్… చివరకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ద్వారా కాళ్ళ బేరానికి వచ్చింది. అయితే పాకిస్తాన్ కాళ్ళబేరానికి రావడంతో… ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ యొక్క నిజస్వరూపం బట్టబయలు చేయడానికి భారత్ ప్రభుత్వం కాల్పుల విరమణకు అంగీకరించింది. అయితే భారత్ తన ఎయిర్ బేస్ లపై ఎలాంటి దాడులు చేయలేదంటూ పాకిస్తాన్ బుకాయించింది.

Pakistan PM Shehbaz Sharif Accept

అయితే  భారత్ మిస్సైల్స్ పాక్ ఏయిర్ బేస్‌లను ధ్వంసం చేయటంపై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్(Pakistan PM) తాజాగా స్పందించారు. తమపై భారత్‌‌ మిస్సైల్స్, డ్రోన్ల దాడులు జరగలేదని ఇన్నిరోజులు ప్రచారం చేసుకుంటున్న పాక్ అధికారులకు, ప్రజలకు ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఊహించని షాక్ ఇచ్చారు. ఆ ప్రచారం అంతా ఒట్టిదేనని పాక్ ప్రధాని చెప్పకనే చెప్పారు. భారత్‌ దాడిలో కీలక ఎయిర్ బేస్ ధ్వంసమైనట్లు ప్రకటించారు. పాక్ ఆయువు పట్టు నూర్ ఏయిర్ బేస్‌పై భారత్ మిస్సైల్స్ దాడి నిజమేనని ఆయన స్వయంగా చెప్పారు.

తాజాగా జరిగిన ఓ పబ్లిక్ మీటింగ్‌ లో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్(Shehbaz Sharif) మాట్లాడుతూ… ‘మే 10వ తేదీ తెల్లవారుజామున జనరల్ అసిఫ్ మునిర్ నాకు ఫోన్ చేశారు. భారత్ మిస్సైల్స్ దాడి చేసిందని అన్నారు. ఓ మిస్సైల్ నూర్ ఖాన్ ఏయిర్‌బేస్‌పై పడిందని… వేరే ప్రాంతాల్లో కూడా మిస్సైల్స్ పేలాయని చెప్పారు’ అని అన్నారు. బీజేపీ అధికార ప్రతినిధి అమిత్ మాళవ్య తన ట్విటర్ ఖాతాలో ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేశారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

కాగా, మే 7వ తేదీన పహల్గామ్ ఉగ్రదాడికి సరైన సమాధానం చెప్పడానికి భారత సాయుధ దళాలు సిద్ధమయ్యాయి. పాకిస్తాన్‌ తో పాటు పాక్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేశాయి. తెల్లవారుజామున 1.05 గంటలకు మొదలైన దాడులు 1.30 గంటలకు ముగిశాయి. మొత్తం 25 నిమిషాల్లో విధ్వంసం సృష్టించాయి. భారత్ మిస్సైల్స్ దాడుల్లో ఏకంగా వంద మంది ఉగ్రవాదులు మరణించారు. ఉగ్రవాద స్థావరాలపై దాడుల నేపథ్యంలో పాక్ ఆర్మీ రెచ్చిపోయింది. ప్రతి దాడులకు దిగింది. దీంతో రెండు దేశాల మధ్య యుద్ధం మొదలైంది. యుద్ధం సందర్భంగా భారత్ .. పాక్ ఏయిర్ బేస్‌లను ధ్వంసం చేసింది. పాక్ ఆయువు పట్టు నూర్ ఏయిర్ బేస్‌ను కూడా పేల్చేసింది.

Also Read : TVK Party Chief: పార్టీ నేతలకు విజయ్‌ కీలక ఆదేశాలు

Leave A Reply

Your Email Id will not be published!