Pakitsan Team Arrives : హైదరాబాద్ కు చేరుకున్న పాక్ టీమ్
గ్రాండ్ వెల్ కమ్ చెప్పిన హెచ్ సీ ఏ
Pakitsan Team Arrives : హైదరాబాద్ – బీసీసీఐ ఆధ్వర్యంలో నిర్వహించే ఐసీసీ వన్డే వరల్డ్ కప్ లో పాల్గొనేందుకు పాకిస్తాన్ జట్టు 7 ఏళ్ల తర్వాత భారత దేశంలో కాలు మోపింది. భారీ ఎత్తున భద్రతను ఏర్పాటు చేశారు. ఇవాళ మహ్మద్ ప్రవక్త పుట్టిన రోజు.
మరో వైపు పెద్ద ఎత్తున వినాయక నిమజ్జనం కొనసాగుతోంది. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే భారత్ , పాకిస్తాన్(Pakistan) దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి.
Pakitsan Team Arrives India
ఇటీవలే ఆసియా కప్ జరిగింది. భారత జట్టు చేతిలో పాకిస్తాన్ ఓటమి పాలైంది. టీమిండియా ఆసియా కప్ గెలుచుకుంది. తాజాగా వరల్డ్ కప్ లో భాగంగా పాకిస్తాన్ ఆడేందుకు ఇక్కడికి వచ్చింది. ఈ సందర్బంగా బాబర్ ఆజమ్ ఆధ్వర్యంలోని జట్టుకు ఘన స్వాగతం పలికింది.
ఆసిస్ తో మూడు మ్యాచ్ ల సీరీస్ ముగిశాక భారత్ వరల్డ్ కప్ లో ఆడనుంది. అక్టోబర్ 14న పాకిస్తాన్ తో భారత్ తలపడనుంది. 29న వరల్డ్ కప్ రన్నర్ గా నిలిచిన న్యూజిలాండ్ తో తలపడనుంది హైదరాబాద్ లో.
ఇక బాబర్ ఆజమ్ టీమ్ అక్టోబర్ 6న రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో నెదర్లాండ్ టీమ్ తో పాల్గొననుంది.
Also Read : Gautam Gambhir Visit : శ్రీవారి సేవలో గౌతమ్ గంభీర్