Pamban Railway Bridge: ప్రారంభానికి సిద్ధమైన పాంబన్‌ వంతెన

ప్రారంభానికి సిద్ధమైన పాంబన్‌ వంతెన

Pamban Railway Bridge : దేశంలో మొట్టమొదటి వర్టికల్‌ లిఫ్ట్‌ రైల్వే సీ బ్రిడ్జి ప్రారంభానికి ముస్తాబైంది. తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో రూ.535 కోట్లతో అధునాతన సాంకేతిక విధానంతో నూతనంగా నిర్మించిన పాంబన్‌ వంతెనను(Pamban Railway Bridge) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi) 6న జాతికి అంకితం చేయనున్నట్లు దక్షిణ రైల్వే శుక్రవారం ప్రకటనలో తెలిపింది. చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే ఈ కార్యక్రమాన్ని శ్రీరామనవమి రోజున మధ్యాహ్నం 12.45 సమయంలో… ప్రధాని పాంబన్‌ నుంచి రిమోట్ పద్ధతిలో వంతెన వర్టికల్‌ లిఫ్ట్‌ మెకానిజాన్ని ప్రారంభిస్తారు. అనంతరం రామేశ్వరం నుంచి తాంబరానికి ప్రత్యేక రైలు పరుగులు తీయనుంది. అనంతరంబహిరంగ సమావేశంలో పాల్గొని రూ.8,300 కోట్ల విలువైన నేషనల్‌ హైవే ప్రాజెక్టులకు శంకుస్థాపన, పూర్తయిన పనులను ప్రారంభిస్తారు. తర్వాత ప్రధాని రామేశ్వర ఆలయాన్ని సందర్శించి జ్యోతిర్లింగాల వద్ద పూజలు నిర్వహిస్తారు.

Pamban Railway Bridge Updates

రామనాథపురం జిల్లా పాంబన్‌ వద్ద రూ.535 కోట్లతో నిర్మించిన రైల్వే వంతెన పనులు దాదాపు పూర్తయ్యాయి. దీనితో ఏప్రిల్ 6 శ్రీరామనవమి రోజున ప్రధాని నరేంద్రమోదీ ఈ వంతెనను ప్రారంభించనున్నారు. ఈ బ్రిడ్జి పై నుంచి రైలును నడిపి ఇప్పటికే ట్రయల్ రన్ పూర్తి చేశారు. అదే సమయంలో బ్రిడ్జి కిందుగా పెద్ద ఓడను దాటించారు. ఈ సమయంలో బ్రిడ్జి సగ భాగాన్ని విజయవంతంగా తెరవగలిగారు. దీనితో ట్రయల్ రన్ పూర్తి అయినట్లు అధికారులు ప్రకటించారు. రైల్వే వంతెన దిగువన పడవలు, నౌకలు సులువుగా వెళ్లేలా వంతెన మధ్యలో పట్టాలు ఇరువైపులా పైకి లేచే విధంగా హైడ్రాలిక్‌ లిఫ్ట్‌యంత్రాలు ఏర్పాటు చేశారు. 2.05 కి.మీల. పొడవైన ఈ రైల్వే వంతెన దేశంలోనే అతి పొడవైనదిగా పేరుగడించింది.

రాష్ట్రంలో ఆగ్నేయ దిశగా బంగాళాఖాతంలో పాక్‌ జలసంధి ప్రాంతంలో పాంబన్‌ రైల్వే వంతెన ఉంది. రామేశ్వరం దీవిని భారత భూభాగంతో కలిపుతూ 1914లో ఆ రైల్వే వంతెన ప్రారంభించారు. అయితే ఇది ప్రారంభించి 110 సంవత్సరాలు కావడంతో తుప్పుపట్టింది. దీనితో 2022లో ఈ వంతెనను మూసివేశారు. అనంతరం ఈ రైల్వే వంతెనను రూ. 531 కోట్ల వ్యయంతో సముద్ర జలాలు, బలమైన గాలులను తట్టుకునేలా నిర్మించాలని నిర్ణయించారు. నూతనంగా నిర్మించిన ఈ వంతెన జీవితకాలం వందేళ్లుగా సాంకేతిక నిపుణులు చెప్తున్నారు. ఈ వంతెనపై రైలు గంటకు 75 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుంది. వంతెనపైన పైకి లేచే లిఫ్ట్ గిర్డర్ 660 మెట్రిక్ టన్నుల బరువు కలిగి ఉంటుంది. ఈ వంతెన ప్రారంభంతో రామేశ్వరం సందర్శించే భక్తుల సంఖ్య పెరుగుతుంది.

Also Read : PM Narendra Modi: మయన్మార్‌ కు మరింత సాయం చేసేందుకు మేము సిద్ధం – ప్రధాని మోదీ

Leave A Reply

Your Email Id will not be published!