Saba Karim : కీప‌ర్ గా కార్తీక్ కంటే పంత్ బెట‌ర్

బీసీసీఐ మాజీ సెలెక్ట‌ర్ స‌బా కరీం

Saba Karim :  యూఏఈ వేదిక‌గా మెగా టోర్నీ ఆసియా క‌ప్ 2022 ప్రారంభం కానుంది కొన్ని గంట‌ల్లో. తాజా, మాజీ ఆట‌గాళ్లు త‌మ అభిప్రాయాల‌ను వ్య‌క్తం చేస్తున్నారు. ఏ జ‌ట్టు గెలుస్తుంద‌నే దానిపై అంచ‌నాలు వేస్తున్నారు.

ఆస్ట్రేలియా స్టార్ మాజీ క్రికెట‌ర్ రికీ పాంటింగ్(Ricky Ponting) అయితే భార‌త్, పాకిస్తాన్ జ‌ట్ల మ‌ధ్యే ఫైన‌ల్ ఉంటుంద‌న్నాడు. ఇక ఈ ఇరు దాయాది దేశాలు తమ దేశాల‌లో ఆడి చాలా కాల‌మైంది.

ఎందుకంటే ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన‌డం వ‌ల్ల‌. కేవ‌లం త‌ట‌స్థ వేదిక‌లపైనే ఆడుతున్నాయి. ఆగ‌స్టు 28న భార‌త్, పాకిస్తాన్ జ‌ట్ల మ‌ధ్య కీల‌క‌మైన మ్యాచ్ జ‌ర‌గ‌నుంది.

ఈ మ్యాచ్ పై కోట్లాది క‌ళ్ల‌న్నీ ఎదురు చూస్తున్నారు. ఈ త‌రుణంలో బీసీసీఐ మాజీ సెలెక్ట‌ర్ స‌బా క‌రీం(Saba Karim) ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు.

భార‌త్ ఆడే తుది జ‌ట్టులో తాను ఎవ‌రిని ఎంచు కోవాల‌ని అనుకుంటే వికెట్ కీప‌ర్ స్థానంలో దినేష్ కార్తీక్ కంటే రిష‌బ్ పంత్(Rishab Pant) కే ప్ర‌యారిటీ ఇస్తాన‌ని స్ప‌ష్టం చేశాడు.

కేఎల్ రాహుల్, దినేష్ కార్తీక్(Dinish Karthik), పంత్ ఈ ముగ్గురిలో పంత్ సరిగ్గా స‌రి పోతాడ‌ని, అత‌డు అద్భుతంగా రాణించే చాన్స్ ఎక్కువ‌గా ఉంద‌ని పేర్కొన్నాడు.

ఇదిలా ఉండ‌గా స‌బా క‌రీం చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు క‌ల‌క‌లం రేపుతున్నాయి. మ‌రో వైపు పాకిస్తాన్ మాజీ క్రికెట‌ర్ వ‌సీం అక్ర‌మ్ అయితే రోహిత్ శ‌ర్మ‌, పంత్, కేఎల్ రాహుల్ వీరంద‌రి కంటే మోస్ట్ డేంజ‌రస్ బ్యాట‌ర్ సూర్య కుమార్ యాద‌వ్ అని పేర్కొన్నాడు.

ప్ర‌స్తుతం సూర్య భాయ్ ఐసీసీ ర్యాంకింగ్స్(ICC Rankings) లో రెండో స్థానంలో కొన‌సాగుతున్నాడు.

Also Read : విరాట్ కోహ్లీ ధోనీ ఫోటో వైర‌ల్

Leave A Reply

Your Email Id will not be published!