Park Jin : గాంధీ సత్యాగ్రహ స్పూర్తికి సలాం – పార్క్ జిన్
ఆయన జీవితం ప్రపంచానికి ఆదర్శ ప్రాయం
Park Jin : ఆధునిక సమాజంలో మహాత్మా గాంధీ జీవితం ఆదర్శ ప్రాయమని పేర్కొన్నారు దక్షిణ కొరియా విదేశాంగ శాఖ మంత్రి పార్క్ జిన్. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆయన భారత్ లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా శనివారం ఢిల్లీలోని రాజ్ ఘాట్ లో మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు. తాను 27 సంవత్సరాల కిందట ఇక్కడ ప్రెస్ సెక్రటరీగా పని చేశానని, ఆనాడు చివరి సారిగా గాందీ స్మారకాన్ని సందరర్శించినట్లు చెప్పారు.
ప్రజాస్వామ్యం , మానవ హక్కుల కోసం వాదించే గాంధీ సత్యాగ్రహ స్పూర్తిని ఈ సందర్భంగా కొనియాడారు పార్క్ జిన్. ఆయన తత్వాలు, సూత్రం లేని రాజకీయాలు, నైతికత లేని వాణిజ్యం, మానవత్వం లేని సైన్స్ ఆధునిక సమాజానికి ముఖ్యమైన రిమైండర్లు అని పేర్కొన్నారు.
భారత దేశాన్ని కొరియాకు సంబంధించిన ప్రత్యేక భాగస్వామిగా అభివర్ణించారు పార్క్ జిన్(Park Jin). స్వేచ్ఛ, శాంతి, శ్రేయస్సును పెంపొందించేందుకు రెండు దేశాలు సహకార దౌత్యంలో నిమగ్నం కాగలవని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదే సమయంలో ఆస్కార్ అవార్డు గెలుచుకున్న నాటు నాటు దక్షిణ కొరియాలో భారీ విజయాన్ని సాధించిందని పార్క్ జిన్ తెలిపారు. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇక్కడికి వచ్చారు. అంతకు ముందు ఉప రాష్ట్రపతి భవనంలో జగదీప్ ధన్ ఖర్ ను కలుసుకున్నారు పార్క్ జిన్(Park Jin).
Also Read : గాడ్సేపై ఓవైసీ షాకింగ్ కామెంట్స్