Partys Manifestos Comment : ఎన్నికలు సరే జనం ఎజెండా ఏది
ఇదేనా ప్రజాస్వామ్యం అంటే
Partys Manifestos Comment : ఎన్నికలు అంటే ఐదేళ్లకు ఒకసారి వచ్చే పండుగ అనుకుంటే ఎలా. నిజమైన ప్రజాస్వామ్యం నువ్వు నేను ఓటు వేసినప్పుడే. మరి నాలుగున్నర కోట్ల ప్రజానీకం ఏమనుకుంటోంది ఎన్నికల గురించి. అంటే ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే వాళ్లు ఎవరి వైపు మొగ్గు చూపిస్తారో చెప్పరు. ఎన్ని సర్వే సంస్థలు గొంతు చించుకున్నా మిగిలింది ఏమీ ఉండదు. ఎన్నికల సమయంలో షెడ్యూల్ ప్రకటించడం, దరఖాస్తులు స్వీకరించడం, ఉపసంహరించు కోవడం, పోలింగ్ జరగడం మామూలే. ఇదంతా దేశంలోని కేంద్ర ఎన్నికల సంఘం పరిధిలో ఉంటుంది. ఇదంతా పక్కన పెడితే ఎన్నికలప్పుడు మాత్రమే ఎన్నికల సంఘానికి బాధ్యతలు ఉంటాయని, చర్యలు తీసుకునే అధికారం ఉంటుందని అంతా అనుకుంటారు. కానీ అలా అనుకోవడం తప్పే. ఎందుకంటే భారత రాజ్యాంగంలో కీలకమైన పాత్ర ఎన్నికల సంఘానికి ఇచ్చారు.
Partys Manifestos Comment Viral
దేశంలో కానీ లేదా రాష్ట్రంలో కానీ ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలంటే , ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటును వినియోగించుకునే సౌకర్యం, సదుపాయం ఉండాలి. అప్పుడే గెలుపు ఓటములను నిర్దేశించే స్థాయికి చేరుకుంటారు. అలా కానిపక్షంలో ప్రజాస్వామ్యం లేనట్టే. ఓట్ల శాతం పెరగాలి. కానీ రాను రాను తగ్గుతోంది. ఆ మధ్యన ఎక్కువగా ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకుంటే వారికి బహుమతులు కూడా ప్రకటించారు. కానీ అలాంటి వాతావరణం ఇవాళ రాష్ట్రాలలో, కేంద్రంలో కొలువు తీరిన ప్రభుత్వాలు కల్పిస్తున్న దాఖలాలు లేవు. లెక్కకు మించి మద్యం, నోట్ల కట్టలు ఏరులై పారుతున్నాయి. ఇక ఆయా పార్టీలకు నిర్దిష్టమైన లక్ష్యాలు ఉండాలి. ఇవాళ అవేవీ ఉండడం లేదు. ప్రజలను మభ్య పెట్టడం, హామీలు ఇవ్వడం, ఆపై అధికారంలోకి రావడం, దోపిడీకి, అక్రమాలకు తెర లేపడం షరా మామూలుగా మారింది.
దేశంలోని 5 రాష్ట్రాలలో ఎన్నికలు జరగనున్నాయి. జనవరి నెలాఖరులోగా ఆయా రాష్ట్రాలలో ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుంది. వచ్చే జనరల్ ఎన్నికలకు రిహార్సల్స్ గా కాంగ్రెస్, బీజేపీ(BJP) భావిస్తున్నాయి. ఇది పక్కన పెడితే ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల నగరా మోగింది. తమకు అనుకూలంగా ఉండేలా హామీలు గుప్పిస్తున్నాయి. గతంలో జరిగిన ఎన్నికల్లో ఇచ్చిన హామీలకే దిక్కు లేకుండా పోయింది. ఇక తాజాగా ఇచ్చిన హామీలు, పథకాల గురించి ఆలోచిస్తే కళ్లు తిరగడం ఖాయం. హామీల వర్షం సరే కానీ ఏ పార్టీ కూడా జనం ఎజెండాగా మేనిఫెస్టోలను తయారు చేసిన దాఖలాలు లేవు. విద్య, వైద్యం, ఉపాధి అన్నది రాజ్యాంగంలో పొందు పర్చిన ప్రాథమిక హక్కు. కానీ వాటినేవీ పట్టించుకునే స్థితిలో పార్టీలు లేవు. మరి ప్రజల ఎజెండా లేని ఈ పార్టీలను ఎందుకు నమ్మాలి. అందుకే ఇకనైనా ఓటర్లు ఆలోచించి వేయండి. ఓటు వజ్రాయుధం అది మీ భవితవ్యాన్ని నిర్దేశిస్తుంది.
Also Read : Revanth Reddy : చంద్రబాబు వల్ల హైటెక్ సిటీ రాలేదు