Parvez Musharraf : పాక్ మాజీ చీఫ్ ముషార‌ఫ్‌ క‌న్నుమూత‌

వెల్ల‌డించిన జియో న్యూస్

Parvez Musharraf : పాకిస్తాన్ దేశ మాజీ అధ్య‌క్షుడు ప‌ర్వేజ్ ముషార‌ఫ్ ఆదివారం క‌న్ను మూశారు. ఆయ‌న వ‌య‌స్సు 79 ఏళ్లు. దుబాయ్ లోని అమెరిక‌న్ హాస్పిట‌ల్ లో ఆయ‌న గ‌త కొంత కాలం నుంచి చికిత్స పొందుతున్నారు. జ‌న‌ర‌ల్ గా ప‌ని చేశారు.

ముషార‌ఫ్ ఆగ‌స్టు 11, 193లో ఢిల్లీలో జ‌న్మించారు. దేశ విభ‌జ‌న అనంత‌రం పాకిస్తాన్ లోని క‌రాచీలోని సెయింట్ పాట్రిక్స్ హైస్కూల్ లో త‌న ప్రాథ‌మిక విద్య‌ను పూర్తి చేశారు. మాజీ అధ్య‌క్షుడు లాహోర్ లోని ఫోర్మాన్ క్రిష్టియ‌న్ కాలేజీలో ఉన్న‌త విద్య చ‌దివారు. మాజీ ప్ర‌ధాన మంత్రి బెన‌జీర్ భుట్టో హ‌త్య కేసు , రెడ్ మ‌సీదు మత గురువు హ‌త్య కేసుల్లో ముషార‌ఫ్ ను ప‌రారీలో ఉన్న వ్య‌క్తిగా ప్ర‌క‌టించారు.

2016 నుండి దుబాయ్ లో నివ‌సిస్తున్నారు ప‌ర్వేజ్ ముషార‌ఫ్(Parvez Musharraf)  . 2007లో రాజ్యాంగాన్ని స‌స్పెండ్ చేసినందుకు దేశ ద్రోహం కేసు న‌మోదు చేశారు. ఇదిలా ఉండగా మాజీ సైనిక పాల‌కుడు వైద్య చికిత్స క‌సోం 2016లో మార్చిలో దుబాయ్ కి వెళ్లారు. కాగా జ‌న‌ర‌ల్ ముషార‌ఫ్ 1999 నుచి 2008 వ‌ర‌కు పాకిస్తాన్ దేశానికి అధ్య‌క్షుడిగా ఉన్నారు.

జ‌న‌ర‌ల్ ప‌ర్వేజ్ ముషార‌ఫ్ మ‌ర‌ణం ప‌ట్ల పాకిస్తాన్ దేశ ప్ర‌ధాన మంత్రి తీవ్ర సంతాపం తెలిపారు. గొప్ప నాయ‌క‌త్వం క‌లిగిన నాయ‌కుడిని కోల్పోయిన‌ట్లు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఆయ‌న కాలంలో పాకిస్తాన్ అత్యంత బ‌ల‌మైన దేశంగా ఉంద‌న్నారు. మ‌రో వైపు పాకిస్తాన్ కు చెందిన వివ‌ధ పార్టీల నాయ‌కులు కూడా తీవ్ర సంతాపం తెలిపారు. ప‌ర్వేజ్ ముషార‌ఫ్ లేక పోవ‌డం దేశానికి తీర‌ని లోటుగా పేర్కొన్నారు.

Also Read : హైద‌రాబాద్ పై ఐఎస్ఐ క‌న్ను

Leave A Reply

Your Email Id will not be published!