Patna Court Summons : రాహుల్ గాంధీకి పాట్నా కోర్టు సమన్లు
ఏప్రిల్ 25న హాజరు కావాలని ఆదేశం
Patna Court Summons : ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీకి(Rahul Gandhi) కోలుకోలేని షాక్ తగిలింది. ఇప్పటికే 2019 నాటి మోదీ పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు 2 ఏళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో లోక్ సభ సభ్యత్వాన్ని కోల్పోయారు. దీనిపై ఆయన ధర్మయుద్ధం చేస్తున్నారు. కానీ పోరాటం మాత్రం ఆపడం లేదు. తాను సత్యం కోసం చివరి రక్తపు బొట్టు ఉన్నంత వరకు పోరాడుతూనే ఉంటానని ప్రకటించారు.
ఇటీవలే తాను ప్రాతినిధ్యం వహించిన వయనాడు లోక్ సభ నియోజకవర్గంలో తన సోదరి ప్రియాంక గాంధీ వార్దాతో కలిసి సత్యమేవ జయతే కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం పలువురు నాయకులతో భేటీ అవుతున్నారు. బీహార్ సీఎం తో పాటు డిప్యూటీ సీఎం, ఎంపీలు కలుసుకున్నారు. ఈ తరుణంలో ఉన్నట్టుండి బీహార్ లోని పాట్నా కోర్టు రాహుల్ గాంధీకి సమన్లు జారీ చేసింది.
మోడీ ఇంటి పేరు కలిగిన వారంతా ఆర్థిక నేరస్థులుగా ఉన్నారంటూ రాహుల్ గాంధీ సంచలన కామెంట్స్ చేశారు. దీనిపై బీజేపీ పెద్ద ఎత్తున అభ్యంతరం తెలిపింది. దీనికి సంబంధించి పాట్నా కోర్టు(Patna Court Summons) రాహుల్ కు సమన్లు జారీ చేసింది. ఏప్రిల్ 25న హాజరు కావాలంటూ ఆదేశించింది. ఒక రకంగా ప్రజల కోసం వాయిస్ వినిపిస్తున్న రాహుల్ గాంధీకి బిగ్ షాక్ అని చెప్పక తప్పదు.
బీజేపీ ఎంపీ , మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీ పాట్నా కోర్టులో పరువు నష్టం దావా వేశారు. ఏప్రిల్ 12న హాజరు కావాలని ఆదేశించింది. అయితే పనులు ఉండడంతో దానిని ఏప్రిల్ 25కి వాయిదా వేసింది.
Also Read : అజిత్ పవార్ బీజేపీకి బానిస కాలేడు