Pavitrotsavams : తిరుచానూరులో వైభవంగా పవిత్రత్సవాలు
భారీ ఎత్తున తరలి వచ్చిన భక్తులు
Pavitrotsavams : తిరుపతి – తిరుచానూరులో వెలసిన శ్రీ పద్మావతి అమ్మ వారి ఆలయంలో పవిత్రోత్సవాలు(Pavitrotsavams) అంగరంగ వైభవోపేతంగా ప్రారంభం అయ్యాయి. తొలి రోజు శ్రీ పద్మావతి అమ్మ వారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో.
Pavitrotsavams in Tiruchanur
ఉదయం సుప్రభాతంతో అమ్మ వారిని మేల్కొలిపి సహస్ర నామార్చన నిర్వహించారు. ఉదయం 8.30 గంటలకు ఉత్సవర్లను ఆలయం నుండి యాగశాలకు వేంచేపు చేశారు. అనంతరం ద్వార తోరణ ధ్వజ కుంభ ఆవాహనం, చక్రాధి మండల పూజ, చతుస్థానార్చన, అగ్ని ప్రతిష్ఠ, పవిత్ర ప్రతిష్ఠ చేపట్టారు.
మధ్యాహ్నం 3 నుండి 4 గంటల వరకు శ్రీ కృష్ణ స్వామి ముఖ మండపంలో అమ్మ వారికి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పసుపు, చందనం, పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్ళు , వివిధ రకాల ఫలాలతో అభిషేకం చేశారు.
అనంతరం అమ్మవారికి విశేషంగా అలంకారం చేశారు.ఈ కార్యక్రమంలో జేఈవో వీరబ్రహ్మం, ఆలయ డెప్యూటీ ఈవో గోవింద రాజన్, ఏఈవో రమేష్, ఆలయ అర్చకులు శ బాబు స్వామి, తదితరులు పాల్గొన్నారు.
Also Read : Bhag Savari : వైభోగం భాగ్ సవారి ఉత్సవం