WII Team Inspects : అలిపిరి న‌డ‌క దారి ప‌రిశీల‌న

డ‌బ్ల్యూఐఐ బృందం రాక

WII Team Inspects : తిరుమ‌ల – దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది తిరుమ‌లలో చోటు చేసుకున్న ఘ‌ట‌న‌. చిరుత‌ల సంచారం భ‌క్తుల‌ను ఆందోళ‌న‌కు గురి చేసింది. ఇటీవ‌ల కాలి న‌డ‌క‌న వ‌చ్చే భ‌క్తుల‌పై దాడుల‌కు పాల్ప‌డ‌డంతో టీటీడీ చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఈ మేర‌కు అట‌వీ శాఖ సూచ‌న‌ల మేర‌కు భ‌క్తుల‌కు చేతి క‌ర్ర‌లు అంద‌జేస్తోంది. ఇప్ప‌టికే చిరుత దాడిలో ఓ చిన్నారి చ‌ని పోయింది.

WII Team Inspects TTD Steps Way

దీంతో వైల్డ్ లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (డ‌బ్ల్యూఐఐ)కి చెందిన ముగ్గురు స‌భ్యుల నిపుణుల టీం అలిపిరి పుట్ పాత్ (న‌డ‌క దారి) మార్గాన్ని ప‌రిశీలించింది. కాలి న‌డ‌క‌న అలిపిరి నుండి ఎన్ఎస్ దేవాల‌యం దాకా ఆరు చిరుత‌లు చిక్కుకున్న కౌశిక్ , ల‌క్షిత‌పై జంతువుల దాడి జ‌రిగిన రెండు ప్ర‌దేశాల‌ను బృందం ప‌రిశీలించింది.

.ఇందులో భాగంగా భూ భాగం, ఫుట్ పాత్ వివ‌రాల‌ను కూడా అధ్య‌య‌నం చేశారు. పెన్సింగ్ , అండ‌ర్ పాస్ లు, ఓవ‌ర్ పాస్ లు వంటి శాశ్వ‌త చ‌ర్య‌ల‌కు సాధ్యా సాధ్యాల‌ను కూడా అధ్య‌య‌నం చేశారు. టీటీడీ(TTD), ఏపీ అటవీ శాఖ తీసుకున్న స్వ‌ల్ప కాలిక చ‌ర్య‌ల‌ను కూడా ధృవీక‌రించారు. ఈ మేర‌కు టీటీడీ తీసుకున్న చ‌ర్య‌ల ప‌ట్ల సంతృప్తిని వ్య‌క్తం చేసింది బృందం.

శాస్త్రవేత్త డాక్టర్ రమేష్, టీమ్ సభ్యులు డాక్టర్ అశుతోష్ సింగ్, ప్రశాంత్ మహాజన్‌లు అలిపిరి ఫుట్ పాత్‌లో జంతువులు వెళ్లేందుకు అండర్ , ఓవర్ పాస్‌లతో పాటు ఫెన్సింగ్‌ను చేపట్టే అవకాశం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిటిడి సిఎఫ్‌ నాగేశ్వరరావు, డిప్యూటీ సిఎఫ్‌ శ్రీనివాసులు పాల్గొన్నారు.

Also Read : Pavitrotsavams : తిరుచానూరులో వైభవంగా ప‌విత్ర‌త్స‌వాలు

Leave A Reply

Your Email Id will not be published!