Pawan and Babu in Bhogi: మందడం భోగి వేడుకల్లో చంద్రబాబు, పవన్‌ !

మందడం భోగి వేడుకల్లో చంద్రబాబు, పవన్‌ !

Pawan and Babu in Bhogi: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పల్లె పట్టణం అని తేడా లేకుండా అన్ని గ్రామాలు, పట్టణాలు సంక్రాంతి శోభను సంతరించుకున్నాయి. రాజకీయ ప్రముఖులు ఎక్కడికక్కడ భోగి మంటల్లో పాల్గొని… సంక్రాంతి సంబరాలను ఘనంగా ప్రారంభించారు. దీనిలో భాగంగా అమరావతి జేఏసి, టీడీపీ, జనసేన అధ్యర్యంలో రాజధాని గ్రామమైన మందడంలో ప్రత్యేకంగా భోగి సంబరాలు నిర్వహించారు. ‘తెలుగు జాతికి స్వర్ణయుగం-సంక్రాంతి సంకల్పం’ పేరుతో నిర్వహించిన ఈ వేడుకలకు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు ఇరు పార్టీల నేతలు, అమరావతి జేఏసి ప్రతినిధులు పాల్గొన్నారు.

Pawan and Babu in Bhogi Viral

ఈ సందర్భంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లకు మందడం గ్రామస్థులతో పాటు రాజధాని రైతులు సాంప్రదాయ బద్దంగా స్వాగతం పలికారు. అనంతరం చంద్రబాబు(Chandrababu), పవన్ కళ్యాణ్ ఇద్దరు భోగి మంటలు వెలిగిస్తూ సంబరాలను ప్రారంభించారు. అంతేకాకుండా వైసీపీ ప్రభుత్వం తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు సంబంధించిన జీవో కాపీలను, రాజధానికి వ్యతిరేకంగా జారీ చేసిన జీవో ప్రతులను భోగి మండల్లో వేసి నిరసన తెలిపారు.

వైసీపీకు కౌంట్‌ డౌన్‌ ప్రారంభం – చంద్రబాబు

ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతూ… వైకాపా ప్రభుత్వ అసమర్థ, విధ్వంస విధానాలతో రాష్ట్ర ప్రజలు తీవ్రంగా నష్టపోయారని ఆరోపించారు. కాబట్టి వైసీపీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభం అయిందన్నారు. అంతేకాదు రాష్ట్రానికి త్వరలో మంచి రోజులు వస్తున్నాయన్నారు. దేవతల రాజధాని అమరావతిని రాక్షసులు చెరబట్టారని విమర్శించారు. అమరావతి రైతులు అడుగడుగునా ఇబ్బందులు ఎదుర్కొన్నారని… ఈ ఐదేళ్లు వారికి చీకటి రోజులని చెప్పారు. ‘ఇవాళ పండుగేమో భోగి.. పాలకుడేమో మానసిక రోగి’ అని వ్యాఖ్యానించారు. శుభగడియలు తలుపు తడుతున్నాయని… ‘వైకాపా విముక్త ఆంధ్రప్రదేశ్‌’ కోసం నేటి నుంచి 87 రోజుల పాటు కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా అందరూ ఒకే బాటలో పయనించాలని పిలుపునిచ్చారు.

రాజధాని రైతుల సంకల్పం నెరవేరుతుంది – పవన్‌

వైసీపీ పాలనతో రాష్ట్రానికి పట్టిన పీడ తొలగిపోయే సమయం ఆసన్నమైందని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ‘‘రాజధాని రైతులను దారుణంగా కొట్టి వేధించిన ఘటన నన్ను కలచివేసింది. రైతుల సంకల్పం నెరవేరుతుంది. బంగారు రాజధాని నిర్మించుకుందాం. ఇది కేవలం అమరావతి సమస్య కాదు… 5కోట్ల మంది ప్రజలది. మీ కష్టం రేపు శ్రీకాకుళం, పులివెందులలోనూ వస్తుంది. భవన నిర్మాణ కార్మికులు, నిరుద్యోగులనూ వైసీపీ మోసం చేసింది’’ అంటూ పవన్‌ కళ్యాణ్‌ మండిపడ్డారు.

Also Read : Minister Ambati Rambabu: భోగి మంటల వద్ద మంత్రి అంబటి స్పెషల్ డ్యాన్స్

Leave A Reply

Your Email Id will not be published!