Chiranjeevi : పాలిటిక్స్ లో నాకంటే పవనే బెటర్
మెగాస్టార్ చిరంజీవి కీలక కామెంట్స్
Chiranjeevi : రాజకీయాలు చాలా విచిత్రమైనవి. ఒక్కోసారి ఘాటుగా ఉండాల్సిన పరిస్థితి. నాకు చేత కాదు. ఎందుకంటే నాది పూర్తిగా డిఫరెంట్. చాలా సౌమ్యంగా ఉండేందుకు ప్రయత్నం చేస్తా. సాధ్యమైనంత వరకు దేనిలోనూ తలదూర్చే మనస్తత్వం కాదు. కానీ ఒక్కోసారి అనుకోకుండా జరిగి పోతుంటాయి.
అలాంటిదే తాను రాజకీయాల్లోకి రావడం. ప్రస్తుతం సినిమాలు చేసుకుంటున్నా. నాకు తగినంత బలం ఉంది. అన్నింటికంటే ఎక్కువ అభిమాన ధనం ఉంది. ఇంతకంటే ఇంకేం కావాలి. ఈ జన్మకు. విచిత్రం ఏమిటంటే పాలిటిక్స్ లో రాణించాలంటే అనాలి, అనిపించు కోవాలి.
మొత్తంగా చూస్తే మా తమ్ముడు పవన్ కళ్యాణ్ కు ఇది బాగా సరి పోతుంది. ఎందుకంటే మనోడు అంటాడు అనిపించుకుంటాడు. ఏదన్నా తలపెడితే పట్టు వదలడు. సాధించేంత దాకా నిద్రపోడు. చిన్నప్పటి నుంచీ అదే. అందుకే మావోడికే పాలిటిక్స్ సరి పోతాయని అన్నారు చిరంజీవి.
ప్రస్తుతం పాలిటిక్స్ లో సక్సెస్ కావాలంటే చాలా తెలివితో పాటు దమ్ము కూడా ఉండాలన్నారు. ఇదిలా ఉండగా ఆదివారం ఎర్రమిల్లి నారాయణమూర్తి కాలేజీ పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిగింది. ఇందులో చదువుకున్న చిరంజీవి(Chiranjeevi) ముఖ్య అతిథిగా విచ్చేశారు.
ఆనాటి స్నేహితులతో కలిసి తన పాతనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఈ సందర్భంగా తమ్ముడు ఏదో ఒక రోజు ఉన్నత స్థాయికి చేరుకుంటాడన్న నమ్మకం తనకు ఉందన్నారు చిరంజీవి.
రాజకీయాల్లో రాణించాలంటే చాలా సున్నితంగా ఉన్న వారు ఎప్పటికీ రాణించ లేరని అన్నారు మెగాస్టార్ చిరంజీవి.
Also Read : మెగాస్టార్ కు కేంద్రం అరుదైన గౌరవం