Pawan Kalyan: పవన్ కళ్యాణ్ భీమవరం పర్యటన వాయిదా ! హెలీకాప్టర్ ల్యాండింగ్ నో పర్మిషన్ ?
పవన్ కళ్యాణ్ భీమవరం పర్యటన వాయిదా ! హెలీకాప్టర్ ల్యాండింగ్ నో పర్మిషన్ ?
Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భీమవరం పర్యటన తాత్కాలికంగా వాయిదా పడింది. పవన్ ప్రయాణించే హెలికాప్టర్ ల్యాండింగ్‌కు ఆర్‌అండ్‌బీ అధికారులు అనుమతి ఇవ్వకపోవడంతో కార్యక్రమాన్ని వాయిదా వేసినట్టు ఆ పార్టీ ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. పర్యటన ఎప్పుడు నిర్వహించేది త్వరలో తెలియచేస్తాం అని తెలిపారు. గతంలో పలువురు ప్రముఖుల భీమవరం పర్యటనలో అదే ప్రాంగణంలో హెలీకాప్టర్ ల్యాండింగ్ కు అనుమతులు ఇచ్చిన ఆర్ అండ్ బీ అధికారులు… ఈ సారి పవన్ కళ్యాణ్ పర్యటనకు మోకాలడ్డడంపై జనసేన శ్రేణులు ప్రభుత్వంపై మండిపడుతున్నాయి. ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్ళ మేరకే అధికారులు… హెలీకాప్టర్ ల్యాండింగ్ కు అనుమతి నిరాకరించారంటూ ఆరోపిస్తున్నారు.
Pawan Kalyan Meeting Updates
‘‘విష్ణు కాలేజీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ లో పవన్ ప్రయాణించే హెలికాప్టర్ ల్యాండ్ చేసేందుకు అనుమతి కోరితే అధికారులు అభ్యంతరం చెబుతూ నిరాకరించారు. ఈ కారణంతో బుధవారం చేపట్టాల్సిన శ్రీ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) గారి భీమవరం పర్యటనను వాయిదా వేయడమైంది. పర్యటన ఎప్పుడు నిర్వహించేది త్వరలో తెలియచేస్తాం. దూరంగా ఉన్న భవనాన్ని సాకుగా చూపిస్తూ హెలీకాప్టర్ ల్యాండింగ్ కు అధికారులు అనుమతుల నిరాకరించడం వెనుక అధికార పార్టీ నాయకుల ఒత్తిడి ఉన్నట్టు అర్థమవుతోంది. ఇదే హెలిప్యాడ్ ను పలువురు ప్రముఖులు భీమవరం పర్యటనకు వచ్చినప్పుడు వినియోగించారు. ఇప్పుడు పవన్ విషయంలో అభ్యంతరాలు తెలపడం విచిత్రంగా ఉంది. ఇదే తరహాలో అమలాపురంలోనూ ఆర్‌అండ్‌బీ అధికారులు అనుమతుల విషయంలో అడ్డంకులు సృష్టిస్తున్నారు. అధికార యంత్రాంగాన్ని రాజకీయ కక్ష సాధింపునకు వాడుకోవడాన్ని ఖండిస్తున్నాం’’ అని జనసేన పార్టీ ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి ప్రకటనలో పేర్కొన్నారు.
Also Read : MP Vijaysai Reddy : టీడీపీ హామీలకంటే చవకైన చైనా ప్రొడక్ట్స్ మేలు..