Pawan Kalyan: ఎన్నికల ప్రచారానికి పవన్ కళ్యాణ్ సిద్ధం !
ఎన్నికల ప్రచారానికి పవన్ కళ్యాణ్ సిద్ధం !
Pawan Kalyan: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో ఏపీలో ఎన్నికల ప్రచారాన్ని ప్రధాన పార్టీలు సమరశంఖం పూరించాయి. దీనిలో భాగంగా ఇప్పటికే టీడీపీ అధినేత నారా చంద్రబాబు రా కదలిరా పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. మరోవైపు వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 27 నుండి మేమంతా సిద్ధం పేరుతో ఎన్నికల ప్రచారాన్ని షురూ చేసారు. దీనితో ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఎన్నికల ప్రచారానికి సిద్ధమౌతున్నారు. కొద్ది నెలల క్రితం రాష్ట్రంలో పలు చోట వారాహి యాత్రను చేపట్టిన జనసేనాని పవన్ కళ్యాణ్… మధ్యలో కాస్తా బ్రేక్ ఇచ్చారు. ఇప్పుడు మరల వారాహి యాత్ర పేరుతో ఎన్నికల ప్రచారానికి సిద్ధపడుతున్నారు.
Pawan Kalyan Start
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారాన్ని తాను పోటీ చేయబోయే పిఠాపురం నుండి ప్రారంభిస్తోన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో శనివారం పిఠాపురం చేరుకుని అక్కడ ఉన్న అష్టాదశ మహాశక్తి పీఠాల్లో ఒకటైన పురూహతికా అమ్మవారిని దర్శించుకుంటారు. ఆ తరువాత పిఠాపురం టీడీపీ ఇన్ చార్జ్ వర్మ ఇంటికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలుస్తారు. అనంతరం విజయభేరి పేరుతో చేబ్రోలు లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తారు. మూడు రోజుల పాటు పిఠాపురంలో బస చేసి పార్టీ నాయకులు, కార్యకర్తలతో వరుస సమావేశాలు నిర్వహిస్తారు.
పిఠాపురం పర్యటన అనంతరం తొలి విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10 నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని ఆ పార్టీ పీఏసీ చైర్మెన్ నాదేండ్ల మనోహర్ ప్రకటించారు. ఈ మేరకు తొలి విడత ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ను ఆయన ప్రకటించారు. జనసేన పార్టీ విడుదల చేసిన తొలి విడత ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ప్రకారం…. ‘‘మార్చి 30వ తేదీ నుంచి ఏప్రిల్ రెండో తేదీ వరకు ఆయన పోటీ చేస్తున్న పిఠాపురంలో ఉంటారు. బహిరంగ సభతో పాటు పార్టీ ముఖ్యనేతలతో సమావేశాలు నిర్వహిస్తారు. 3న తెనాలి, 4న నెల్లిమర్ల, 5న అనకాపల్లి, 6న యలమంచిలి, 7న పెందుర్తి, 8న కాకినాడ రూరల్ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. 9న పిఠాపురంలో నిర్వహించే ఉగాది వేడుకల్లో పాల్గొంటారు. 10న రాజోలు, 11న పి.గన్నవరం, 12న రాజానగరం నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో పాల్గొంటారు.
Also Read : Bandaru Satyanarayana : వైసీపీ నుంచి భారీగా ఆఫర్లు వస్తున్నాయి అంటున్న మాజీ మంత్రి