Pawan Kalyan Chandrababu : బాబుతో పవన్ కళ్యాణ్ భేటీ
కీలక అంశాలపై చర్చలు
Pawan Kalyan : హైదరాబాద్ – జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ టీడీపీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. బుధవారం జనసేనాని తన నివాసంలో కలుసుకున్నారు. ఈ సందర్బంగా కీలక అంశాలు చర్చకు వచ్చాయి.
Pawan Kalyan and Chandrababu Meeting Updates
తెలంగాణలో ఎన్నికలు ముగిశాయి. జనసేన పార్టీ బేషరతుగా బీజేపీ తరపున వకల్తా పుచ్చుకుంది. ప్రచారం చేశారు పవన్ కళ్యాణ్. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాలుగైదు నెలల్లో ఎన్నికలు రానున్నాయి. ఈ సందర్బంగా ఎలాంటి వ్యూహాలు పన్నాలి, సీట్ల పంపకంపై చర్చించినట్లు సమాచారం.
ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ తమ పార్టీకి 40 నుంచి 42 సీట్లు కావాలని పవన్ కళ్యాణ్ ఈ సందర్బంగా చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) ను కోరారు. అయితే 25 నుంచి 30 సీట్లు ఇచ్చేందుకు చంద్రబాబు ఆలోచిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
మరో వైపు 5 పార్లమెంట్ స్థానాలు కూడా కావాలని జనసేన చీఫ్ కోరారు. 2 సీట్లు ఇచ్చే ఆలోచనలో బాబు ఉన్నట్లు పేర్కొన్నారు. ఈనెల చివరి నాటి వరకు సీట్ల పంపకం పూర్తవుతుందని ఇందుకు సంబంధించి మరోసారి భేటీ కానున్నారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకున్న తుపాను కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలను ఆదుకోవడంలో ఏపీ సీఎం విఫలమయ్యారని పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఆరోపించారు.
Also Read : Telangana CS DGP : సీఎస్..డీజీపీ ఏర్పాట్లు పరిశీలన