Pawan Kalyan OG Title : ఐదు భాషల్లో పవన్ కళ్యాణ్ OG టైటిల్ రిజిష్టర్..

Pawan Kalyan OG Title : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న సినిమాలలో ఒకటి సుజీత్ దర్శకత్వంలో వస్తున్న సినిమా OG (వర్కింగ్ టైటిల్).. సుజీత్ గతంలో రన్ రాజా రన్, సాహూ వంటి చిత్రాలను తెరకెక్కించి మంచి విజయాలను అందుకున్నారు.

ఇక్కడ మరో విషయం ఏమంటే దర్శకుడు సుజీత్ స్వయంగా పవన్ కళ్యాణ్‌కి(Pawan Kalyan) వీరాభిమాని. దీంతో ఈ సినిమాపై అంచనాలు మరో రేంజ్‌లో ఉన్నాయి. ఈ సినిమా ఇటీవల గ్రాండ్‌గా లాంఛ్ అయిన సంగతి తెలిసిందే. 

ఈ సినిమా గ్యాంగ్‌స్టర్ బ్యాక్ డ్రాప్‌లో వస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ అని అంటున్నారు. ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందించనున్నారు. సుజీత్ ఓ పవర్‌ఫుల్ కథను రెడీ చేశారట. 

టాలీవుడ్ వర్గాల సమాచారం మేరకు ఈ సినిమాకు టైటిల్ కూడా ఖరారు అయ్యినట్లు తెలుస్తోంది. మొదట ఈ సినిమాకు వర్కింగ్ టైటిల్‌గా OG అని ప్రచారం చేసారు. అయితే ఈ టైటిల్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో ఇక అదే టైటిల్‌ను దర్శక నిర్మాతలు రిజిష్టర్ చేశారని తెలుస్తోంది. 

నిర్మాత DVV దానయ్య, 5 ప్రధాన భారతీయ భాషలలో OG అనే టైటిల్‌ని(Pawan Kalyan OG Title) రిజిష్టర్ చేశారట. దీంతో ఈ సినిమా ప్యాన్ ఇండియా స్థాయిలో వస్తోందని తెలుస్తోంది.

ఇక టైటిల్ ఖరారు అవ్వడంతో అతి త్వరలో అధికారిక ప్రకటనరావాల్సి ఉంది. అది అలా ఉంటే అతి త్వరలో ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టనుంది. ఈ క్రమంలో చిత్రబృందం లొకేషన్స్‌ను వెతికే పనిలో పడింది. దీనికోసం దర్శకుడు సుజీత్ తన టీమ్‌తో లొకేషన్ రిక్కీ చేస్తున్నారు. దీనికి సంబంధించిన పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 

ఇక ఈ సినిమాకు రవి కె చంద్రన్ సినిమాటోగ్రాఫర్‌గా చేస్తున్నారు. పవన్- సుజీత్ కాంబోలో వస్తున్న ఈ సినిమా 200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.

Also Read : బలగం డైరెక్టర్ కు కేటీఆర్ సన్మానం ..!

Leave A Reply

Your Email Id will not be published!