Pawan Kalyan: కుమారుడి ఆరోగ్య పరిస్థితిపై స్పందించిన పవన్‌ కళ్యాణ్

కుమారుడి ఆరోగ్య పరిస్థితిపై స్పందించిన పవన్‌ కళ్యాణ్

Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్(Mark Shankar)… సింగపూర్ లోని స్కూల్ లో జరిగిన అగ్నిప్రమాదంలో చిక్కుకున్నారు. ఈ ఘటనలో మార్క్ శంకర్ చేతికి, కాలికి గాయాలు కావడంతో పాటు… ఊపిరితిత్తుల్లోకి పొగ చేరడంతో అస్వస్థతకు గురయ్యాడు. దీనితో రెండు రోజుల అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కు… ఈ విషయం తెలియగానే హుటాహుటీన సింగపూర్ బయలుదేరి వెళ్లారు. సమాచారం తెలిసిన వెంటనే బయలుదేరాల్సి ఉన్నప్పటికీ… కురిడి గ్రామానికి చెందిన గిరిజనులకు ఇచ్చిన మాట ప్రకారం… ఆ గ్రామంలో సభ నిర్వహించిన అనంతరం ఆయన హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. అనంతరం జూబ్లీహిల్స్‌ లో తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో… కుమారుడు మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితి మరియు ప్రమాద ఘటన గురించి వివరించారు.

Pawan Kalyan Responds his Son Incident

హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) మాట్లాడుతూ… అరకు పర్యటనలో ఉండగా ఈ అగ్నిప్రమాదం జరిగినట్లు తనకు ఫోన్‌ వచ్చిందని తెలిపారు. నా కుమారుడు మార్క్ శంకర్‌ స్కూల్‌ లో అగ్నిప్రమాదం జరిగిందని సింగపూర్‌ హైకమిషనర్‌ సమాచారం అందించారు. మొదట చిన్నపాటి అగ్ని ప్రమాదం అనుకున్నా. కానీ, ప్రమాద తీవ్రత ఇంత ఉంటుందని ఊహించలేదు. 30 మంది పిల్లలు సమ్మర్‌ క్యాంప్‌లో ఉండగా ఈ ప్రమాదం జరిగింది. ఓ పసిబిడ్డ చనిపోయింది. నా కుమారుడు మార్క్‌ శంకర్‌కు చేతులకు, కాళ్లకు గాయాలయ్యాయి. ఊపిరితిత్తులోకి పొగ వెళ్లినట్లు తెలిసింది. నా పెద్దకొడుకు అకీరా పుట్టినరోజే చిన్నకొడుక్కి ఇలా జరగడం బాధాకరం’’ అని పవన్‌ అన్నారు.

ప్రధాని మోదీ ఫోన్‌​ చేసి ప్రమాద ఘటనపై వాకబు చేసారని… సింగపూర్(Singapore) హైకమీషనర్ తో కూడా మాట్లాడి అవసరమైన సహాయం చేస్తానని తెలిపారన్నారు. అలాగే సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రులు లోకేశ్, అనిత, అచ్చెన్నాయుడు, నాదేండ్ల మనోహర్, మాజీ సీఎం జగన్, తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి, రామ్మోహన్ నాయుడు, పలువురు సినీ నటులు ఈ ఘటనపై స్పందించారని… వారందరికీ పేరుపేరునా పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. మీడియా సమావేశం అనంతరం… తన పెద్ద కుమారుడు అకీరాతో కలిసి పవన్ కళ్యాణ్… సింగపూర్ బయలుదేరినట్లు తెలుస్తోంది. మరోవైపు మార్క్ శంకర్ పెదనాన్న మెగాస్టార్ చిరంజీవి, పెద్దమ్మ సురేఖ కూడా సింగపూర్ బయలుదేరారు. వీరితో పాటు పవన్ కు అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు కూడా సింగపూర్ బయలుదేరి వెళ్ళడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

అసలు ఏం జరిగిందంటే ?

ఏప్రిల్‌ 8వ తేదీ ఉదయం 9,45గం. ప్రాంతంలో సింగపూర్‌ లోని రివర్‌ వ్యాలీ రోడ్‌ ఎడ్యుకేషన్‌ సెంటర్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. రెండు,మూడు అంతస్తుల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో బడిలో 80 మంది పిల్లలు ఉన్నారు. అరగంటపాటు శ్రమించిన ఫైర్‌ సిబ్బంది మంటల్ని అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి మరణించగా.. 15 మంది పిల్లలు, నలుగురు స్టాఫ్‌ గాయపడ్డారు. ఈ ఘటనపై అక్కడి అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు. ఈ సంఘటనపై సమాచారం అందుకున్న సింగపూర్‌ సివిల్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌ ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టింది. ఈ భవనంలో చిక్కుకున్న వారిని రెస్క్యూ సిబ్బంది రక్షించి బయటకు తీసుకొచ్చారు.

Also Read : New Liquor Brands: తెలంగాణలో 604 కొత్త మద్యం బ్రాండ్లకు దరఖాస్తులు

Leave A Reply

Your Email Id will not be published!