Pawan Kalyan: అటవీ శాఖ ఉద్యోగులపై దాడి ఘటనపై డిప్యూటీ సీఎం పవన్‌ ఆగ్రహం !

అటవీ శాఖ ఉద్యోగులపై దాడి ఘటనపై డిప్యూటీ సీఎం పవన్‌ ఆగ్రహం !

Pawan Kalyan: పల్నాడు జిల్లాలో అటవీ శాఖ ఉద్యోగులపై దాడిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పర్యావరణ, అటవీ శాఖల మంత్రి పవన్‌ కళ్యాణ్‌ ఖండించారు. విజయపురి సౌత్ అధికారులపై దాడి ఘటనపై పల్నాడు జిల్లా కలెక్టర్, ఎస్పీలతో పవన్ కళ్యాణ్ ఫోన్లో మాట్లాడారు. ఈ ఘటన పూర్వాపరాలను తెలుసుకున్నారు. ఉద్యోగులపై దాడి చేసిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని వారికి సూచించారు. అటవీ ప్రాంత పరిసరాల్లోని ప్రజలకు అటవీ, వన్యప్రాణి సంరక్షణ చట్టాలపై అవగాహన కల్పించాలన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో వన్య ప్రాణులను, జంతువులను వేటాడి, అక్రమ రవాణా చేసేవారిపై ఉపేక్షించవద్దని పవన్ కళ్యాణ్(Pawan Kalyan) రాష్ట్ర అటవీ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు.

పల్నాడు జిల్లాలోని విజయపురి సౌత్ రేంజ్ అటవీ పరిధిలో వన్య ప్రాణి అలుగు (పంగోలియన్)ను వేటాడి అక్రమ రవాణా చేసే ముఠాను అదుపులోకి తీసుకొనేక్రమంలో వారు అటవీశాఖ సిబ్బందిపై దాడి చేసారు. ఈ ఘటనలో అటవీశాఖకు చెందిన జీపు అద్దాలు ద్వంసం కావడంతో పాటు సిబ్బందికి స్వల్పగాయాలయ్యాయి. దీనితో ఈ విషయం అటవీ శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) దృష్టికి వెళ్ళడంతో… ఉద్యోగులపై దాడి ఘటనపై మంగళవారం ఆరా తీశారు. వన్య ప్రాణులను, అటవీ సంపదకు నష్టం కలిగించినా, అక్రమ రవాణా చేసినా, ఉద్యోగులపై దాడులు చేసినా చట్టపరంగా కఠిన చర్యలలు తీసుకోవాలని స్పష్టం చేశారు. సోమవారం అరణ్య భవన్ లో నిర్వహించిన గ్లోబల్ టైగర్ డే కార్యక్రమంలో తను చదువుకొనే రోజుల్లో ఒంగోలులో అలుగును కొందరు వ్యక్తులు కొట్టి చంపడం జరిగిందనే విషయాన్ని ప్రస్తావించానని ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మరోసారి ప్రస్తావించారు.

Pawan Kalyan – అమెరికా కాన్సుల్‌ జనరల్‌ తో పవన్‌ భేటీ !

డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ తో అమెరికా కాన్సుల్‌ జనరల్‌ జెన్నిఫర్‌ లార్సన్‌ భేటీ అయ్యారు. లార్సన్‌ బృందాన్ని ఆయన సత్కరించారు. ఏపీలో పెట్టుబడులు, అభివృద్ధి ప్రాజెక్టులపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. ఉన్నత విద్యకు అమెరికా వెళ్లే యువతకు సహకారం ఇవ్వాలని పవన్‌ కళ్యాణ్‌ కోరారు.

Also Read : Justice Madan B Lokur: విద్యుత్‌ విచారణ కమిషన్‌ కొత్త ఛైర్మన్‌ గా జస్టిస్‌ మదన్‌ బి లోకూర్‌ !

Leave A Reply

Your Email Id will not be published!