Pawan Kalyan : మా జోలికి వస్తే ఊరుకోను – పవన్
నిప్పులు చెరిగిన జన సేన పార్టీ చీఫ్
Pawan Kalyan : ఏపీలో రాజకీయాలు మరింత వేడెక్కాయి. శాసనసభ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ పార్టీ నేతల మధ్య మాటల యుద్దం మొదలైంది. ఓ వైపు టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు ఇంకో వైపు పవన్ కళ్యాణ్, సోమూ వీర్రాజు, వైఎస్ జగన్ మాటల తూటాలు పేల్చుతున్నారు. మరింత వేడిని రాజేస్తున్నారు. ఇప్పటికే చంద్రబాబు తన ప్రచారాన్ని ప్రారంభించారు. తనయుడు నారా లోకేష్ యువ గళం పేరుతో పాద యాత్ర చేపట్టారు.
మరో వైపు వారాహి యాత్రకు శ్రీకారం చుట్టారు జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్. జూన్ 14 నుంచి 23 వరకు ఏపీలో కొనసాగనుంది ఈ యాత్ర. ఇందులో భాగంగా ప్రజలతో మమేకం అవుతున్నారు పవన్ కళ్యాణ్. ఇదే సమయంలో మేధావులు, రైతులు, న్యాయవాదులు, మీడియా ప్రతినిధులు, వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు, వ్యాపారవేత్తలతో సమావేశం నిర్వహించారు జన పార్టీ చీఫ్.
ఇక వారాహి యాత్రలో నా వద్దకు కష్టాలను చెప్పుకునేందుకు వచ్చిన వారిని వైసీపీ నాయకులు వేధింపులకు గురి చేస్తున్నారంటూ మండిపడ్డారు పవన్ కళ్యాణ్(Pawan Kalyan). చంపడానికి కూడా సిద్దపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. దీని గురించి ఒక్క పోలీస్ ఆఫీసర్ మాట్లాడ లేదని ఆరోపించారు. గూండాల తాట తీసేందుకు సిద్దంగా ఉన్నానని స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్.
Also Read : Telangana High Court : తెలంగాణ సర్కార్ పై హైకోర్టు ఫైర్