Pawan Singh: బీజేపీకి షాక్ ! పోటీ చేయలేనంటూ తప్పుకున్న లోక్ సభ అభ్యర్ధి !
బీజేపీకి షాక్ ! పోటీ చేయలేనంటూ తప్పుకున్న లోక్ సభ అభ్యర్ధి !
Pawan Singh: మరికొద్ది రోజుల్లో జరగనున్న లోక్ సభ ఎన్నికలకు 195 మంది అభ్యర్ధులతో తొలి జాబితాను విడుదల చేసిన బీజేపీ అధిష్టానానికి… భోజ్ పురి సింగర్, నటుడు పవన్ సింగ్(Pawan Singh) భారీ షాక్ ఇచ్చారు. తనకు కేటాయించిన పశ్చిమ బెంగాల్ లోని అసన్ సోల్ లోక్ సభ స్థానం నుండి పోటీ చేయలేనని తేల్చి చెప్పాడు. ఇదే విషయాన్ని తన సోషల్ మీడియా ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తెలిపారు. ‘‘నాపై నమ్మకం ఉంచి అసన్ సోల్ అభ్యర్థిగా నా పేరును ప్రకటించినందుకు బీజేపీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అయితే… కొన్ని కారణాల వల్ల నేను ఈ ఎన్నికల్లో పోటీ చేయలేను’’ అని ఆయన ఆదివారం మధ్యాహ్నం ట్వీట్ చేశారు. అయితే పవన్ సింగ్ పోటీ నుంచి తప్పుకోవడానికి… ఆయన అభ్యర్ధిత్వాన్ని మహిళలు తీవ్రంగా వ్యతిరేకించడమే కారణంగా కనిపిస్తోంది.
Pawan Singh Resign Viral
పవన్ సింగ్ కు తొలి జాబితాలో చోటు దక్కిందన్న విషయం తెలియగానే… బెంగాలీల నుంచి తీవ్రస్థాయిలో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. పవన్ డిస్కోగ్రఫీలో బెంగాలీ మహిళల్ని కించపరిచే పాటలు ఎన్నో ఉన్నాయని, ఆయన పాటల్లో మహిళల్ని ఎంతో అసభ్యంగా చూపిస్తారని, అలాంటి వ్యక్తికి ఎంపీ సీటు ఎలా ఇస్తారని విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే… పవన్‌పై ఉన్న వ్యతిరేకత పార్టీపైనే ప్రభావం చూపించవచ్చని బీజేపీ గ్రహించి అతడ్ని తొలగించడమే శ్రేయస్కరమని భావించి… ఈ సమాచారం అతనికి తెలియజేసినట్లు తెలుస్తోంది. అందుకే బీజేపీ అధిష్టానం ఆదేశాల మేరకు తాను ఎన్నికల నుంచి తప్పుకుంటున్నట్టు పవన్ సింగ్ ట్వీట్ చేశాడని సమాచారం.
పవన్ సింగ్ చేసిన ట్వీట్ పై తృణమూల్ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ మాట్లాడుతూ… ఈ ఉపసంహరణ పశ్చిమ బెంగాల్ ప్రజల అద్వితీయమైన స్ఫూర్తికి నిదర్శనమని అన్నారు. మరో తృణమూల్ నాయకుడు డెరెక్ ఓబ్రెయిన్ ట్వీట్ చేస్తూ… అసలు ఆట ప్రారంభం కాకముందే బీజేపీకి దెబ్బ తగిలిందంటూ కౌంటర్ వేశారు. సింగర్, పొలిటీషియన్ బాబుల్ సుప్రియో బదులిస్తూ… పోటీ నుంచి తప్పుకోవాలంటూ పవన్‌పై బీజేపీ ఒత్తిడి చేసి ఉంటుందని అభిప్రాయపడ్డారు.
Also Read : AP CM YS Jagan : విద్యార్థులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్..ఏపీ విద్యార్థులకు ఫ్రీ ల్యాప్ టాప్ లు