PBKS IPL 2023 Auction : పంజాబ్ కింగ్స్ ఫుల్ జోష్

భారీ ధ‌ర‌కు క‌ర‌న్ కొనుగోలు

PBKS IPL 2023 Auction : కేర‌ళ లోని కొచ్చిలో జ‌రిగిన ఐపీఎల్ మినీ వేలం పాట‌లో భారీ ధ‌ర‌కు సామ్ క‌ర‌న్ ను కొనుగోలు చేసింది పంజాబ్ కింగ్స్ ఎలెవ‌న్. ఏ జ‌ట్టు ఊహించ‌ని స్థాయిలో రికార్డు ధ‌ర ప‌లికాడు క‌ర‌న్. ఏకంగా రూ. 18.50 కోట్ల‌కు చేజిక్కించుకుంది. మిగ‌తా ఆటగాళ్ల‌ను కూడా తీసుకుని ఫుల్ జోష్ లో క‌నిపిస్తోంది. ఈసారి ఐపీఎల్ లో సామ్ క‌ర‌న్ అద్భుత‌మైన ఆట తీరుతో ఆక‌ట్టుకున్నాడు.

పంజాబ్ మేనేజ్ మెంట్ ఓన‌ర్ల‌లో ఒక‌డైన నెస్ వాడియా కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. ఈ జ‌ట్టుకు న‌టి ప్రీతి జింతా కూడా భాగ‌స్వామిగా ఉన్నారు. ప్ర‌తిభ ఆధారంగానే డ‌బ్బులు పెట్టాల్సి వ‌స్తుంద‌ని తెలిపాడు నెస్ వాడియా. ఐపీఎల్ చ‌రిత్ర‌లో అత్య‌ధిక ధ‌ర‌కు అమ్ముడు పోయిన ప్లేయ‌ర్ రికార్డు సృష్టించాడు క‌ర‌న్.

ఇదిలా ఉండ‌గా సామ్ క‌ర‌న్ ను భారీ ధ‌ర‌కు కొనుగోలు చేసిన పంజాబ్ కింగ్స్(PBKS IPL 2023 Auction) ఎలెవ‌న్ మిగ‌తా ఆట‌గాళ్ల‌కు త‌క్కువ బ‌డ్జెట్ కేటాయించింది. ఇక కొనుగోలు చేసిన ఇత‌ర ఆట‌గాళ్ల లిస్టులో శివ‌మ్ సింగ్ ను రూ. 20 ల‌క్ష‌ల‌కు తీసుకుంది.

మోహిత్ రాథీతో పాటు విద్వాత్ క‌వేర‌ప్ప‌ను రూ. 20 ల‌క్ష‌ల‌కే చేజిక్కించుకుంది. ఇక హ‌ర్ ప్రీత్ భాటియాకు రూ. 40 ల‌క్ష‌లు వెచ్చిస్తే సికింద‌ర్ ర‌జాను రూ. 50 ల‌క్ష‌ల‌కు కైవ‌సం చేసుకుంది.

ఇక రిటైన్ చేసుకున్న ఆట‌గాళ్ల జాబితా ఇలా ఉంది. శిఖ‌ర్ ధావ‌న్ కెప్టెన్ కాగా , షారుఖ్ ఖాన్ , జానీ బెయిర్ స్టో , ప్ర‌భ్ సిమ్రాన్ సింగ్ , భానుక రాజ‌ప‌క్స‌, జితేశ్ శ‌ర్మ‌, రాజ్ బావా, రిషి ధావ‌న్ , లియామ్ లివింగ్ స్టోన్ , అథ్వ‌ర టైడే , అర్ష్ దీప్ సింగ్ , బ‌ల్వేజ్ సింగ్ , నాథ‌న్ ఎల్లిస్ , క‌గిసో ర‌బాడ‌, రాహుల్ చాహ‌ర్ , హ‌ర్ ప్రీత్ బ్రార్ ఉన్నారు.

Also Read : ఆట‌గాళ్ల స‌మ‌తూకం ఆర్సీబీ అంద‌లం

Leave A Reply

Your Email Id will not be published!