PBKS vs LSG IPL 2023 : పంజాబ్ కింగ్స్ లక్నో జెయింట్స్ ఫైట్
ఇరు జట్లకు లీగ్ మ్యాచ్ కీలకం
PBKS vs LSG IPL 2023 : ఐపీఎల్ 16వ సీజన్ లో మరో కీలక మ్యాచ్ జరగనుంది శుక్రవారం. కేఎల్ రాహుల్ సారథ్యంలోని లక్నో సూపర్ జెయింట్స్ , శిఖర్ ధావన్ నాయకత్వంలోని పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్ల మధ్య బిగ్ ఫైట్ జరగనుంది. ఇరు జట్లు ఇప్పటి వరకు లీగ్ లో భాగంగా 7 మ్యాచ్ లు ఆడాయి. రెండూ 4 మ్యాచ్ లలో విజయం సాధించగా 3 మ్యాచ్ లలో ఓటమి పాలయ్యాయి.
ఇక బ్యాటింగ్, బౌలింగ్ పరంగా పంజాబ్ కింగ్స్ కంటే కొంత మెరుగ్గా కనిపిస్తోంది లక్నో సూపర్ జెయింట్స్. కానీ మైదానంలోకి దిగితే కానీ ఎవరు గెలుస్తారో చెప్పలేని పరిస్థితి. పాయింట్ల పట్టికలో లక్నో మెరుగైన రన్ రేట్ కారణంగా 4వ స్థానంలో కొనసాగుతోంది.
ఇక 5వ స్థానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉండగా 6వ స్థానంలో ఆశించిన మేర రన్ రేట్ లేక పోవడంతో పంజాబ్ కింగ్స్ ఎలెవన్ నిలిచింది.
ఇవాళ జరిగే కీలక పోరులో ఒకవేళ పంజాబ్ గెలిస్తే ఆర్సీబీకి బిగ్ షాక్ ఇచ్చినట్లవుతుంది. ఎందుకంటే ప్లే ఆఫ్ కు చేరాలంటే మొదటి 4 స్థానాలలో ఉండాలి. ఇప్పటికే టాప్ లో రాజస్థాన్ రాయల్స్ , 2వ స్థానంలో గుజరాత్ టైటాన్స్ , 3వ స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ , 4వ స్థానంలో లక్నో కొనసాగుతున్నాయి. ఒకవేళ లక్నో గనుక విజయం సాధిస్తే చెన్నై సూపర్ కింగ్గస్ కు బిగ్ షాక్ తగులుతుంది. మొత్తంగా ఈ మ్యాచ్ ఇరు జట్లకు అత్యంత కీలకమని చెప్పక తప్పదు. మరి గబ్బర్ సింగ్ ఏం చేస్తారో చూడాలి.
Also Read : ఢిల్లీ క్రికెటర్ అసభ్య ప్రవర్తన