PBKS vs LSG IPL 2023 : లక్నో జోర్ దార్ పంజాబ్ బేజార్
56 పరుగుల భారీ తేడాతో విక్టరీ
PBKS vs LSG IPL 2023 : ఐపీఎల్ 16వ సీజన్ లో లక్నో సూపర్ జెయింట్స్ అరుదైన ఘనత సాధించింది. అత్యధిక స్కోర్ చేసి తనకు ఎదురే లేదని చాటింది. గత ఏడాది లక్నో ఐపీఎల్ లోకి ఎంటరైంది. తాజాగా పంజాబ్ కింగ్స్ ఎలెవన్ తో జరిగిన కీలక లీగ్ మ్యాచ్ లో పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 257 పరుగుల భారీ స్కోర్ సాధించింది.
అనంతరం బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ ఎలెవన్(PBKS vs LSG IPL 2023) 201 పరుగులకే ఆలౌటైంది. లక్నో బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. పంజాబ్ బౌలర్లకు చుక్కలు చూపించారు. ఫోర్లు సిక్సర్లతో విరుచుకుపడ్డారు. దీంతో ఐపీఎల్ లో అత్యధిక స్కోర్ చేసిన జట్టుగా అరుదైన ఘనత సాధించింది లక్నో సూపర్ జెయింట్స్ .
ఆట ఆరంభం నుంచి దాడి మొదలు పెట్టారు. దీంతో పరుగులు సునాయసంగా లభించాయి. వికెట్లు తగ్గినా ఎక్కడా తల వంచలేదు. దంచి కొట్టడమే పనిగా పెట్టుకున్నారు లక్నో క్రికెటర్లు. కైల్ మేయర్స్ , మార్కస్ స్టోయినిస్ సిజిల్ పవర్ హిట్టింగ్ ఆకట్టుకునేలా చేసింది. దీంతో పంజాబ్ 56 పరుగుల తేడాతో పరాజయం పాలైంది పంజాబ్. ఈ గెలుపుతో లక్నో పాయింట్ల పట్టికలో మరో స్థానం ముందుకు వెళ్లింది.
కైల్ మేయర్స్ 24 బంతుల్లో 54 రన్స్ చేశాడు. స్టోయినిస్ 40 బంతులు ఆడి 72 పరుగులతో హోరెత్తించాడు. ఇక పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్టులో అథరవ టైడే దుమ్ము రేపాడు. 36 బంతులు ఎదుర్కొని 66 రన్స్ చేశాడు. లియామ్ లివింగ్ స్టోన్ 22 బంతులు ఆడి 36 పరుగులతో రాణించాడు. సికిందర్ రజా 14 బాల్స్ ఆడి 23 కే పరిమితమయ్యాడు. యువ పేసర్ యశ్ ఠాకూర్ 4 ఓవర్లలో 37 రన్స్ ఇచ్చి 4 వికెట్లు తీశాడు. చివరలో వచ్చిన సామ్ కరన్ 11 బంతులు ఆడి 21 పరుగులు చేసినా ఫలితం లేక పోయింది.
Also Read : కైల్ మేయర్స్ అదుర్స్