Peddireddy Rama Chandra Reddy : బాబుపై పెద్దిరెడ్డి ఫైర్
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి కామెంట్
Peddireddy Rama Chandra Reddy : టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడిపై నిప్పులు చెరిగారు రాష్ట్ర అటవీ, ఇంధన, పర్యావరణ , శాస్త్ర సాంకేతిక, భూగర్భ జల వనరుల శాఖ మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డి(Peddireddy Rama Chandra Reddy) . మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాయలసీమ ప్రాజెక్టులపై మాట్లాడే అర్హత లేదన్నారు. 14 ఏళ్లుగా సీఎంగా ఉండి సొంత నియోజకవర్గానికి చుక్క నీరు ఇవ్వలేక పోయారని ఆరోపించారు. ఆయన చేస్తున్న యాత్ర ఏడుపు యాత్రగా అభివర్ణించారు.
Peddireddy Rama Chandra Reddy Comments
ఎలాంటి చర్చకైనా తాము సిద్దంగా ఉన్నామని స్పష్టం చేశారు పెద్ది రెడ్డి రామ చంద్రా రెడ్డి. దమ్ముంటే కుప్పంలోకి రావాలని సవాల్ విసిరారు మంత్రి. చంద్రబాబు ఏం చేశాడో..వైఎస్సార్, జగన్ రెడ్డి ఏం చేశారో బహిరంగంగా చర్చిద్దామని అన్నారు. గండికోట ద్వారా పుంగనూరు, తంబళ్లపల్లి, పీలేరు, మదనపల్లికి నీరు అందించేందుకు జగన్ సిద్దమైనట్లు చెప్పారు. ఆవులపల్లి, నేతిగుంట్లపల్లి, ముదివేడు ప్రాజెక్టులు నిర్మిస్తుంటే సుప్రీంకోర్టు దాకా వెళ్లి ఆ పనులను అడ్డుకుంది చంద్రబాబు నాయుడు కాదా అని ప్రశ్నించారు.
హంద్రీ నీవాకు వైఎస్ 5 ఏళ్లలో 95 శాతం పనులు పూర్తి చేశారని చెప్పారు. కానీ కుప్పం బ్రాంచ్ కెనాల్ ను కూడా కమీషన్ కక్కుర్తితో పూర్తి చేయలేక పోయావంటూ ప్రశ్నించారు చంద్రబాబును. రూ. 200 కోట్ల అంచనా ఖర్చును రూ. 440 కోట్లకు పెంచింది నువ్వు కాదా అంటూ మండిపడ్డారు.
Also Read : TS TET Recruitment 2023 : టెట్ నోటిఫికేషన్ రిలీజ్